Asianet News TeluguAsianet News Telugu

నాని సినిమాని రీమేక్ చేస్తున్న షారూఖ్ ఖాన్?

ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉండవచ్చు అనే విషయమై బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు ఇదో రివేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. 

Shah Rukh Khan Remaking Nanis Film?
Author
Mumbai, First Published Sep 20, 2021, 12:37 PM IST

బాలీవుడ్ నటుడు షారుఖ్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.   ఇప్పటికే పుణెలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది 2022లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఆల్రెడీ లయిన్ అనే టైటిల్ ని పెట్టారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉండవచ్చు అనే విషయమై బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు ఇదో రివేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. 

కథ ప్రకారం షారూఖ్  పగ,ప్రతీకారంతో రగిలిపోతున్న  కొంతమంది ఆడవాళ్లను పోగు చేస్తాడు. వాళ్లంతా గతంలో ఓ దొంగతనంతో తమ జీవితాల్లో ఇబ్బందులు పడ్డవాళ్లు. వాళ్లందరినీ కలిపి ఓ ప్లాన్ చేసి, దొంగతనం చేసిన విలన్ పై పోరాడతాడు. నయనతార, ప్రియమణమి, సన్యా మల్హోత్రా ఇంకా మరికొంతమంది ఈ పాత్రల్లో కనిపించనున్నారు.  ఇవన్నీ చూస్తున్న నానీ నటించిన గ్యాంగ్ లీడర్ గుర్తు వస్తోందంటున్నారు. ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారా లేక ఆ సినిమాకు మూలమైన గర్ల్ స్కౌట్ అనే కొరియా సినిమా రైట్స్ తీసుకున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాని గ్యాంగ్ లీడర్ బాగుందని టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా ఫ్లాఫ్ అయ్యింది. 

తమిళంలో ‘రాజా రాణి’, ‘తెరీ’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ చిత్రాలతో నిరూపించుకున్న అట్లీకి హిందీలో ఇది తొలిచిత్రం. ప్రస్తుతం షారుఖ్‌-దీపిక పదుకొణె కలయికలో వస్తున్న ‘పఠాన్‌’ షూటింగ్‌ లొకేషన్ల ఎంపిక కారణంగా వాయిదా పడింది. ఈలోపు ఆ సమయాన్ని అట్లీ చిత్రంలో నటించేందుకు ఇచ్చారట షారుఖ్‌. 10రోజుల పాటు పుణెలో చిత్రీకరణ జరగనుంది. కాగా ఈచిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అంశం ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అట్లీ తొలి చిత్రం ‘రాజారాణి’లో నటించిన నయనతార ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుంది. ఈ విషయం పై నయన్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాన్య మల్హోత్ర, సునీల్‌ గ్రోవర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

2019 నుంచి షారుఖ్‌ - అట్లీల చిత్రంపై ఇప్పటికే అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిజం అయ్యాయి. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌కి  ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు.. ఏఆర్‌ రెహమాన్‌, అనిరుధ్‌ రవిచందర్‌ పనిచేస్తున్నారని వినిపించగా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios