Asianet News TeluguAsianet News Telugu

హాస్పిటల్ లో చేరిన షారూఖ్,కారణం

షారూఖ్ ఖాన్ అహ్మదాబాద్‍లోని కేడీ ఆసుపత్రిలో షారుఖ్ ఖాన్ చేరినట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై భిన్న కథనాలు వస్తున్నాయి. 

Shah Rukh Khan Admitted To Ahmedabad Hospital jsp
Author
First Published May 23, 2024, 7:41 AM IST


బాలీవుడ్ బాద్‍షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో చేరటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుకు కారణం వడదెబ్బే అంటున్నారు. అహ్మదాబాద్‍లో వడదెబ్బకు గురైన ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ మధ్య  జరిగిన ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్‍కు షారుఖ్ హాజరయ్యారు. కోల్‍కతా గెలిచిన తర్వాత స్టేడియంలో ఆ జట్టు యజమాని అయిన షారుఖ్ సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేశారు. అయితే, అహ్మదాబాద్‍లో అధిక ఉష్ణోగ్రత వల్ల  షారుఖ్ ఖాన్ వడదెబ్బకు గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం షారూఖ్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది.
 
 “అహ్మదాబాద్‍లో సుమారు 45 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో షారుఖ్ డీహైడ్రేషన్‍కు గురయ్యారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆసుపత్రి చుట్టూ భద్రత పెంచాం” అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‍ఎస్ పేర్కొంది. అయితే, ఆయన ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్టు కూడా సమాచారం బయటికి వచ్చింది.

నేషనల్ మీడియాలో  మీడియాలో మాత్రం షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై భిన్న కథనాలు వస్తున్నాయి.  డీ హైడ్రేషన్ వల్ల ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఇతర  కారణాల వల్ల హాస్పటల్ లో చేరినట్లు చెబుతున్నారు.  

అలాగే అనారోగ్యం, ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ వార్తలపై షారూఖ్ ఖాన్ ఫ్యామిలీ నుంచి.. అతని కంపెనీ అయిన రెడ్ చిల్లీస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.   షారుఖ్‍తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్, ఫ్రెండ్ జూహి చావ్లా ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది. షారుఖ్ పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios