Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ లోకి బుల్లితెర స్టార్ ప్రభాకర్, చంద్రహాస్..? ఇక హౌస్ అంతా రచ్చ రచ్చే..

ఇక బిగ్ బాస్ హడావిడికి టైమ్ అయ్యింది.. బిగ్ బాస్ సీజన్ వచ్చేసింది. టెలివిజన్ లో హడావిడి మొదలయ్యింది. బిగ్ బాస్ 7 లోకి.. వెళ్లబోయేది వీరే అంటూ.. రోజుకో కొత్త పేరు వినిపిస్తుంది. తాజాగా బుల్లితెర స్టార్స్ పేరు కూడా బయటకు వచ్చింది. 
 

Serial Star Prabhakar and His Son Chandrahas In Bigg Boss 7 JMS
Author
First Published Jul 16, 2023, 7:11 PM IST

బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ వస్తుందంటే చాలు ఇక పండగే.. టాలీవుడ్ తెరపై కూడా ఈ షో బాగా పాపులర్ అయ్యింది. లాస్ట్ ఇయర్ మాత్రం కాస్త ప్లాప్ టాక్ వచ్చినా.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 కు మసాలా గట్టిగా అద్దబోతున్నారు మేకర్స్. అందులో భాగంగా.. కాస్త కాంట్రవర్సీ.. కొంచెం కన్నింగ్.. ఎక్కువగా కామెడీ.. అన్నీ కలగలిపేలా.. కంటెస్టెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారట టీమ్. అందుకే రోజుకో పేరు ఈ లిస్ట్ లో వినిపిస్తుంది.  

వరల్డ్ టెలివిజన్ లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకొని టెలివిజన్ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించింది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్  6 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా   పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం  సీజన్ 7 తో ఆడియన్స్ ముందుకు సరికొత్తగా రాబోతోంది.  ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. గత కొంతకాలంగా ఈ షో జరుగుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అయినా ఇటీవలే విడుదలైన ప్రోమోతో ఈ షో త్వరలో ప్రారంభం కానుందని క్లారిటీ ఇచ్చేసారు. 

దీంతో ఇప్పుడు ఈ షోలో కంటెస్టెంట్ లు ఎవరు.. లిస్ట్ ఫైనల్ అయ్యిందా లేదా అనేదాని విషయంలో.. రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈక్రమంలో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న క్రమంలో.. తాజాగా బిగ్ బాస్ లోకి ఓ షాకింగ్ కంటెస్టెంట్ రాబోతున్నారంటూ వార్తలు హైలెట్ అవుతున్నాయి.  ఎవ్వరూ ఊహించని ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ హౌస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ సారి బిగ్ బాస్ లోకి..  బుల్లి తెర మెగా స్టార్ గా పేరు తెచ్చుకున్న సీరియల్ స్టార్ ప్రభాకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.  సీరియల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించాడు ప్రభాకర్. కెరీర్ బిగినింగ్ లో ఈటీవీ షోస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు ప్రభాకర్.  మొదట్లో యాహు అనే టీవీ షో తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ప్రభాకర్. ఇక ఆ తర్వాత ఆయన ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.నటుడిగా, దర్శకుడిగా ప్రభాకర్ కు మంచి పేరు ఉంది. 

అంతే కాదు..వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించాడు ప్రభాకర్.  బుల్లి తెర మెగా స్టార్ అనిపించుకున్న ప్రభాకర్ ను  హౌస్ లోకి తీసుకొని వస్తే ఆడియన్స్ కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారని మేకరర్స్ భావిస్తున్నారట. ఇక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ రీసెంట్  గానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన యాటీడ్యూడ్ స్టార్ అని బిరుడు కూడా తగిలించుకున్నాడు. కాస్త డిఫరెంట్ గా.. పొగరుగా ఉన్న ఈ కుర్రాడు ప్రభాకర్ బదులుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈసారి బిగ్ బాస్ ను చాలా త్వరగా స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారట టీమ్. అందకుకే ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని..  ఈ షో ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ నుంచి సమాచారం అందుతోంది. అసలే రేటింగ్ లేదు అని తలపట్టుకున్న బిగ్ బాస్ మేకర్స్.. సీజన్ 7ను ఎలా ప్లాన్ చేశారో.. ఆడియన్స్ కు ఎలాంటి ట్విస్ట్ లు ఇవ్వబోతున్నారో చూడాలిమరి. 

Follow Us:
Download App:
  • android
  • ios