Asianet News TeluguAsianet News Telugu

అలనాటి అందాల తార రాధతో డ్యాన్స్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలాదిత్య

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు.

Senoir actress Radha gives entry into bigg boss 6
Author
First Published Dec 18, 2022, 8:40 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఇప్పుడు వీరిలో విజేత ఎవరు, 2 స్థానం, 3 వ స్థానం ఎవరికి దక్కబోతున్నాయి అనే ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠని మరోస్థాయికి చేర్చాడు హీరో నిఖిల్. నిఖిల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. దీనితో నాగార్జున నిఖిల్ తో కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ గురించి, 18 పేజెస్ రిలీజ్ గురించి సరదాగా ముచ్చటించారు. కార్తికేయ 2 అంత పెద్ద విజయం సాధించినందుకు నాగార్జున నిఖిల్ ని అభినందించారు. 

ఇక నాగార్జున నిఖిల్ కి ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని నిఖిల్ ని హౌస్ లోకి పంపారు. నిఖిల్ కి నాగార్జున ఒక రెడ్ హ్యాట్ ఇచ్చారు. నిఖిల్ ఆ హ్యాట్ ని ఎవరి తలపై పెడితే వారు ఎలిమినేట్ అయినట్లు. హుషారుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ రెండు నిమిషాల పాటు తెగ టెన్షన్ పెట్టాడు. 

టాప్ 5 అందరి దగ్గరకి వెళుతూ ఊరిస్తూ వాళ్ళని టెన్షన్ పెట్టాడు. చివరికి నిఖిల్ రెడ్ హ్యాట్ ని రోహిత్ తలపై పెట్టాడు. దీనితో రోహిత్ టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయ్యాడు. రోహిత్ ఎలిమినేట్ అయినప్పుడు అతడి తల్లిదండ్రులు, భార్య మెరీనా ఎమోషనల్ అయ్యారు. నిఖిల్ అతడిని వేదికపైకి తీసుకువచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ఇంతటి అద్భుతమైన జర్నీ పొందినందుకు నాగార్జున రోహిత్ ని అభినందించారు. 

అనంతరం వేదికపైకి అలనాటి అందాల తార రాధా ఎంట్రీ ఇచ్చింది. బిబి జోడి షోకి రాధా జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. వేదికపైకి వచ్చిన రాధాతో నాగార్జున సరదాగా ముచ్చటించారు. ఆమె డ్యాన్స్ గురించి ప్రశంసించారు. నాగార్జున, రధా విక్కీ దాదా చిత్రంలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. 

రాధా తనపై తానే సెటైర్లు వేసుకుంటూ నవ్వించింది. తాను అప్పుడు ఎంత సన్నగా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని తెలిపింది. డ్యాన్స్ చేయకుండా తాను ఇంట్లో కూడా నడవనని పేర్కొంది. బాలాదిత్య తనకు పెద్ద ఫ్యాన్ ని అని చెప్పఁడంతో ఆమెతో కలసి డ్యాన్స్ చేసే అవకాశాన్ని నాగార్జున కల్పించారు. దీనితో రాధా బాలాదిత్యతో డ్యాన్స్ చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios