అమెజాన్ ప్రైమ్ యాజమాన్యానికి ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ఖేదం మోదం రెండు కలిగిస్తుంది. సిరీస్ సక్సెస్ టాక్ తెచ్చుకున్నందుకు సంతోష పడాలో, వివాదాలలో ఇరుకున్నందుకు బాధపడాలతో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ కి కొనసాగింపుగా సెకండ్ సీజన్ అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. 


సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ శ్రీలంక తమిళ్ రెబల్స్ ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కించారు. ఇండియాపై దాడి చేయడానికి వచ్చిన  తమిళ్ రెబల్ గా సమంత నటించడం జరిగింది. ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ విడుదల నాటి నుండే ఈ సిరీస్ పై తమిళులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సమంతను ట్రోల్ చేయడం జరిగింది.  


ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ప్రసారం నిలిపివేయాలని అక్కడ ప్రజా నేతలు కోరుకుంటున్నారు. తాజాగా  సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఈ వెబ్‌సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన ది ఫ్యామిలీ మెన్‌ 2 వెబ్‌సిరీస్‌ను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకపోవడం బాధాకరమన్నారు. తమిళ ద్రోహులు రూపొందించిన వెబ్‌సిరీస్‌గా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని కోరారు. ప్రసారాన్ని ఆపకుంటే అమెజాన్‌ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.