నీ కొడుక్కి మాట్లాడటమే రాదు.. అమర్ దీప్ కు సపోర్ట్ చేసినందకు రాశీపై రైతు బిడ్డ ఫ్యాన్స్ ఫైర్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కాస్త డిఫరెంట్ గా సాగుతోంది. ఈసారి ఇంకాస్త శృతిమించిన గొడవలు జరుగుతుండగా.. వారికిసపోర్ట్ గా బయట కూడా ఫ్యాన్స్ మాటల యుద్దం జరుగుతూనే ఉంది. తాజాగా అమర్ దీప్, రైతు బిడ్డ ఫ్యాన్స్ మధ్య మాటల తూటాలుపేలాలియ.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కాస్త డిఫరెంట్ గా సాగుతోంది. ఈసారి ఇంకాస్త శృతిమించిన గొడవలు జరుగుతుండగా.. వారికిసపోర్ట్ గా బయట కూడా ఫ్యాన్స్ మాటల యుద్దం జరుగుతూనే ఉంది. తాజాగా అమర్ దీప్, రైతు బిడ్డ ఫ్యాన్స్ మధ్య మాటల తూటాలుపేలాలియ.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఏడో సీజన్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ఎనిమిదో వారం వీకెండ్ వరకూ వచ్చేసింది. అయితే హౌస్ లో ఇప్పటికే వాడీ వేడీ రచ్చ జరుగుతూనే ఉంది. కోట్లాటలు ఒక్కటే తక్కువ.. ఆల్మోస్ట్ మాటలతో కొట్టుకునేవరకూ వచ్చేసింది వ్యావహారం. ఇక గేమ్స, టాస్క్ ల విషయం చెప్పాల్సిన పనిలేదు. లోపల ఎంత రచ్చ జరుగుతుందో.. బయట కూడా వారి ఫ్యాన్స్ మధ్య అదే రచ్చ కొనసాగుతోంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు హౌజ్ మేట్స్‌కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. అలా తాజాగా అమర్ దీప్ చౌదరికి సపోర్టుగా నిలిచింది అలనాటి హీరోయిన్, ప్రముఖ సీనియర్ నటి రాశి. తన కొడుకుని గెలిపించాలంటూ ఒక వీడియో విడుదల చేసిందీ
ఆమె అమర్ దీప్ కు తల్లిగా నటిస్తోంది. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన జానకి కలగనలేదు సీరియల్‌లో రాశి, అమర్ దీప్ చౌదరి తల్లీ కొడుకులుగా నటించారు. జ్ఞానాంబ పాత్రలో రాశి, ఆమె కుమారుడిగా రామా అమర్ దీప్ నటించి మెప్పించారు. ఇక ఈసీరియల్ లో జానకిగా నటించిన ప్రియాంక కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉంది. ఇక ఈ నేపథ్యంలో అమర్ దీప్ బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లడంతో తన కొడుకుకు ఓటేయమంటూ రాశి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో రిలీజ్ చేసిన క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆమె వీడియో రిలీజ్ చేయడం బాగానే ఉంది. కాని.. రాశీ అమర్ దీప్‌కు సపోర్టుగా నిలవడం చాలా మందికి నచ్చడం లేదు. ఆమె అలా వీడియో పెట్టడంతోనే.. మరుక్షణమే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ లైన్‌లోకి వచ్చారు. రాశిని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెట్టారు. మీరు చెబితే మేం ఓటు వేయాలా? మా ఓటు రైతు బిడ్డకే, సీరియల్ బ్యాచ్ అందరూ గకలిసి గ్రూపిజం అడుతున్నారు మేడమ్. అతనికి ఎందుకు ఓటేయాలి?, ప్రతిసారి రైతు బిడ్డనే టార్గెట్ చేస్తున్నారు, ‘అసలు అమర్‌కు సరిగా మాట్లాడడమే రాదు, ‘దయచేసి అతనికి ఓటు వేయమని అడగకండి మేడం అని కామెంట్లు పెట్టారు రైతు బిడ్డ ఫ్యాన్స్. మీరు అసలు బిగ్ బాస్ చూస్తున్నారా అని ప్రశ్నించారు.