రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సెలబ్రిటీలు పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఆయన పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు విత్తన గణపతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అందులో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులకు విత్తన గణపతి విగ్రహాలను అంద జేశారు. ఆ విగ్రహాన్ని అందుకున్న ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి, తన ఇంట్లో గణనాధుడికి పూజలు చేసి, ఇంట్లోనే నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ సంతోష్‌కు అభినందనలు తెలపటంతో పాటు విత్తన గణపతి విశిష్టతను తెలియజేశారు.
"