ప్రముఖ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీనితో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రముఖ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీనితో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రభుకి వైద్యం జరుగుతోంది. నటుడు ప్రభు గురించి పరిచయం అవసరం లేదు. తండ్రి పాత్రల్లో ఆయన ఎంత చక్కగా ఒదిగిపోతారో తెలిసిందే.
ప్రభు చంద్రముఖి, డార్లింగ్, వీడోక్కడే , ఆరెంజ్, దరువు లాంటి చిత్రాల్లో నటించారు. తమిళంలో ఆయన ఎప్పుడూ బిజీగా ఉండే ఆర్టిస్ట్. ఇదిలా ఉండగా ప్రభు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కాస్త ఎక్కువగా ప్రభు అస్వస్థతకి గురయ్యారు. దీనితో ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు వెంటనే చిత్స ప్రారంభించి ఆసవరమైన టెస్టులు చేశారు. ఆయన కిడ్నీలో ఉన్న రాళ్ళని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రభు ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. దీనితో ప్రభు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభు ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటన అందించారు. చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ స్నేహితుడిగా నటించారు. డార్లింగ్ లో ప్రభాస్ కి తండ్రిగా వినోదభరితంగా నటిస్తూనే, ఎమోషనల్ గా కూడా మెప్పించారు. దరువు చిత్రంలో జూనియర్ యమధర్మ రాజుగా నటించారు. ప్రస్తుతం ప్రభు మణిరత్నం పొన్నియన్ సెల్వం 2లో నటిస్తున్నారు.
