Asianet News TeluguAsianet News Telugu

శేఖర్ కమ్ముల ఆడిషన్స్ కోసం రూ.80 చీర కట్టుకుని వెళ్లిన సీనియర్ హీరోయిన్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది ఈ మూవీ. లవ్ స్టోరీ మూవీపై మంచి బజ్ నెలకొని ఉంది.

Sekhar kammula reveals interesting facts about Easwari Rao
Author
Hyderabad, First Published Sep 23, 2021, 10:03 AM IST

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది ఈ మూవీ. లవ్ స్టోరీ మూవీపై మంచి బజ్ నెలకొని ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లవ్ స్టోరీ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ, వసూళ్లు ఎలా ఉంటాయో అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

లవ్ స్టోరీ విజయం సాధిస్తే మిగిలిన చిత్ర నిర్మాతలు, దర్శకులకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా లవ్ స్టోరీ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. సీనియర్ హీరోయిన్ ఈశ్వరి రావు ఈ చిత్రంలో నాగచైతన్య తల్లిగా, పేద ఇంటి గృహిణిగా నటిస్తోంది. 

దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కోసం ఈశ్వరి రావు గారిని ఫోన్ కాల్ లో అప్రోచ్ అయ్యాను. క్యారెక్టర్ గురించి వివరించి ఆడిషన్స్ కోసం రావాలని కోరాను. మరుసటి రోజు ఆమె రూ.80 చీర కట్టుకుని క్యారెక్టర్ లో ఆడిషన్స్ కి వచ్చేశారు. మేమంతా షాక్ అయ్యాం. అంత డెడికేషన్ ఉన్న నటి ఆమె అంటూ శేఖర్ కమ్ముల ప్రశంసలు కురిపించారు. 

ఈశ్వరి రావు ఇటీవల అద్భుతమైన అవకాశాలు అందుకుంటున్నారు. రజనీకాంత్ కాలా చిత్రంలో నటించారు. అలాగే అల వైకుంఠపురములో, అరవింద సమేత చిత్రాల్లో ఆమె నటించడం విశేషం. కాలా చిత్రంలో తన రోల్ చూసి శేఖర్ కమ్ముల గారు ఈ అవకాశం ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. క్యారెక్టర్ వివరించగానే తెలంగాణ ఆడపడుచులా తయారై వెళ్ళాను. దీనితో అందరూ ఆశ్చర్యపోయినట్లు ఆమె పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios