Asianet News TeluguAsianet News Telugu

ధనుష్ తో థ్రిల్లర్ మూవీ, లీడర్ 2 పక్కా.. మళ్ళీ సాయి పల్లవితో అందుకే : శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల పేరు చెప్పగానే హ్యాపీ డేస్, ఆనంద్, లీడర్, ఫిదా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. శేఖర్ కమ్ముల టేకింగ్, కథాంశాలు మిగిలిన దర్శకుల కంటే విభిన్నంగా ఉంటాయి.

Sekhar kammula reveals dhanush movie details
Author
Hyderabad, First Published Sep 20, 2021, 5:16 PM IST

శేఖర్ కమ్ముల పేరు చెప్పగానే హ్యాపీ డేస్, ఆనంద్, లీడర్, ఫిదా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. శేఖర్ కమ్ముల టేకింగ్, కథాంశాలు మిగిలిన దర్శకుల కంటే విభిన్నంగా ఉంటాయి. కమ్ముల శైలి పూర్తిగా డిఫెరెంట్ గా ఉంటుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నుంచి రాబోతున్న మూవీ లవ్ స్టోరీ (Love Story). 

సాయి పల్లవి (sai Pallavi), నాగ చైతన్య (Naga Chaitanya) జంటగా నటించిన ఈ చిత్రం మంచి బజ్ తో సెప్టెంబర్ 24న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. 

తన డాన్స్, నటన, క్యూట్ లుక్స్ తో అందరిని మెప్పిస్తున్న హీరోయిన్ సాయి పల్లవి. ఫిదా తర్వాత సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో నటించింది. సాయి పల్లవిని రిపీట్ చేయడంపై శేఖర్ కమ్ముల స్పందించారు. 

ఫిదాలో సాయి పల్లవి ఎలా నటించిందో తెలుసుగా. లవ్ స్టోరీ చిత్రం కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. సో మరో ఆలోచన లేకుండాఆమే నా ఛాయిస్ అని కమ్ముల అన్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర ఫిదా చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమె పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. తన పాత్రలో సాయి పల్లవి మెస్మరైజ్ చేసేలా నటించింది. ఈ పాత్రకు సాయి పల్లవి కన్నా బెటర్ ఛాయిస్ ఇంకెవరూ లేరు అని శేఖర్ కమ్ముల అన్నారు. 

ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా ఓపెన్ అయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ కాంబినేషన్ ని అధికారికంగా ప్రకటించారు కూడా. దీనిపై కమ్ముల మాట్లాడుతూ ధనుష్ కోసం తాను థ్రిల్లర్ కథ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కథ భారీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు కమ్ముల అన్నారు. 

ఇక లీడర్ చిత్రానికి సీక్వెల్ గురించి కమ్ముల స్పందించారు. లీడర్ సీక్వెల్ తప్పకుండా ఉంటుంది. అయితే ఎప్పుడనేది చెప్పలేం. రానా హీరోగా, అదే కాస్టింగ్ తో లీడర్ 2 తెరకెక్కిస్తానని శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios