Asianet News TeluguAsianet News Telugu

'ఇస్మార్ట్ శంకర్' టీజర్ అదిరింది, రామ్ చెడ్డోడుగా...

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' .  మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.  అయితే ఈ లోగా పూరి బ్యాచ్ ఆ టీజర్ ని చూసేసారు. ఆ ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేక సోషల్ మీడియాలో ఆ టీజర్ అదిరిపోయిందని అంటున్నారు.

Satyadev About Ismart Shankar teaser
Author
Hyderabad, First Published May 13, 2019, 7:49 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' .  మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.  అయితే ఈ లోగా పూరి బ్యాచ్ ఆ టీజర్ ని చూసేసారు. ఆ ఎగ్జైట్మెంట్ ని ఆపుకోలేక సోషల్ మీడియాలో ఆ టీజర్ అదిరిపోయిందని అంటున్నారు.

తాజాగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టీజర్‌ అదిరిపోయిందని నటుడు సత్యదేవ్‌ అన్నారు . ఈ టీజర్‌ను ముందుగానే చూసిన నటుడు సత్యదేవ్‌ ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయం షేర్ చేసారు.

‘బాస్‌ పూరీ జగన్నాథ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హై వోల్టేజ్‌ను ఇప్పుడే చూశా (టీజర్‌ను ఉద్దేశిస్తూ). రామ్‌ పుట్టినరోజు కోసం కట్‌ చేసిన టీజర్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. ఇది పూరీ, రామ్‌ అభిమానులకు ట్రీట్‌ లాంటిది. సినిమాలో రామ్‌ చెడుకు పర్యాయపదంలా అనిపించారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కి రామ్ రిప్లై ఇచ్చారు. ‘హ హ హ.. ధాంక్స్’ అని రిప్లై ఇచ్చారు.  

ఇస్మార్ట్‌ శంకర్‌’లో నిధి అగర్వాల్‌, నభా నటేష్‌  హీరోయిన్స్. పూరీ, ఛార్మి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ  సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మేలోనే విడుద‌ల చేయాలని అనుకున్నారు. కానీ నటి నిధి అగ‌ర్వాల్ పాస్ పోర్ట్ పోవ‌డంతో... షూటింగ్ ఆల‌స్యమైంది. రీసెంట్ గా ఈ చిత్రం టాకీ పూర్తయింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios