దేనిగొడవ దానిదే ఆపద్దంటూ మహేష్..

కొన్నాళ్లు ఇంట్లోనే ఉన్న మహేష్, ఈ సినిమా కోసం రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే మహేష్ హెయిర్‌ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. షూటింగ్ రద్దు చేశారు మేకర్స్. 
 

Sarkaru Vaari Paatas teaser work is underway jsp

మహేష్ బాబు అభిమానులంతా ఎదురుచూస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట' .పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ ఫ్రీ అయ్యాక దూబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ లో కీ సీన్స్, ఒక సాంగ్, ఛేజింగ్ సీన్లు తీసి ఆ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేసింది యూనిట్. కొద్ది రోజులు హైదరాబాద్ షెడ్యూల్ లో షూటింగ్ చేసారు. కొన్నాళ్లు ఇంట్లోనే ఉన్న మహేష్, ఈ సినిమా కోసం రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే మహేష్ హెయిర్‌ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. షూటింగ్ రద్దు చేశారు మేకర్స్. 

ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ ని రెడీ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు దర్శకుడు పరుశరామ్ ఫ్రీ టైమ్ లో టీజర్ కట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఎడిటర్స్ తో ఆన్ లైన్ లో సూచనలు ఇస్తూ పనిచేయిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మే 31 న ఈ టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఫస్ట్ కట్ చేసి మహేష్ కు పంపితే ఆయన దాన్ని చూసి సూచనలు చెప్తారు. తర్వాత ఫైనలైజ్ చేస్తారు.
 
 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios