`సరిగమప నెక్ట్స్ ఐకాన్` విన్నర్ యశస్వి కొండేపూడి.. లైఫ్ మార్చిన `లైఫ్ ఆఫ్ రామ్`
`సరిగమప నెక్ట్స్ ఐకాన్` విన్నర్‌గా సింగర్ యశస్వి కొండేపూడి నిలిచారు. `జాను` చిత్రంలోని `లైఫ్ ఆఫ్ రామ్` పాటతో ఒక్కసారిగా ఓవర్‌నైట్‌లో స్టార్ సింగర్‌గా పాపులర్ అయిన యశస్వి కొండేపూడి. తాజాగా జీ తెలుగు ఈ సీజన్ `సరిగమప` టైటిల్‌ని యశస్వి సొంతం చేసుకోవడం విశేషం.
`సరిగమప నెక్ట్స్ ఐకాన్` విన్నర్‌గా సింగర్ యశస్వి కొండేపూడి నిలిచారు. `జాను` చిత్రంలోని `లైఫ్ ఆఫ్ రామ్` పాటతో ఒక్కసారిగా ఓవర్‌నైట్‌లో స్టార్ సింగర్‌గా పాపులర్ అయిన యశస్వి కొండేపూడి. తాజాగా జీ తెలుగు ఈ సీజన్ `సరిగమప` టైటిల్‌ని యశస్వి సొంతం చేసుకోవడం విశేషం. దీన్ని హీరో రానా దగ్గుబాటి ఆదివారం ఎపిసోడ్‌లో అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా యశస్వి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. చాలా ఎమోషనల్ అయ్యారు. అక్కడే ఉన్న వారి పేరెంట్స్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరోవైపు యశస్వి ప్రియురాలు కూడా ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. యశస్విని విన్నర్‌గా రానా ప్రకటించడంతో ఆమె సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఎమోషనల్ అయ్యారు. ఈ ఎపిసోడ్ వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జీ తెలుగు `సరిగమప` పేరుతో పాటల పోటీలను నిర్వహిస్తుంది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడం అనే కాన్సెప్ట్ తో ప్రతిభ ఉండి,బయటకు రాలేని సింగర్స్ కి అవకాశాలు కల్పిస్తుంది. పోటీ నిర్వహించి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అద్భుతమైన సింగర్స్ ని తయారు చేసి చిత్ర పరిశ్రమకి అందిస్తుంది. దీని ద్వారా ఎంతో మంది అద్భుతమైన సింగర్స్ బయటకు వచ్చారు. యశస్వి సైతం అద్బుతమైన సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా టైటిల్ విన్నర్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.