సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రల్లో అయినా మెప్పించగలిగే అతికొద్ది మంది నటుల్లో శరన్ శక్తి ఒకరు. 22 ఏళ్ల ఈ కుర్రాడు ఈ మధ్య కనిపించిన ప్రతి సినిమాలో యాక్టింగ్ తో ఇరగదీస్తున్నాడు. మణిరత్నం కడలి సినిమా ద్వారా  చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన శరన్ చూస్తుండగానే స్టార్ హీరోలతో వర్క్ చేస్తూ వచ్చాడు. 

కోలీవుడ్ లో ఒక దశవరకు బాగానే క్లిక్కయిన శరన్ కెరీర్ కి యూ టర్న్ ఇచ్చే అవకాశాలు తక్కువగా వచ్చాయి. ఇక ఇన్నాళ్ళకి ఒక పాన్ ఇండియన్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. రాక్ స్టార్ యష్ నటిస్తున్న KGF సెకండ్ చాఫ్టర్ లో శరన్ శక్తి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గత ఏడాది ధనుష్ చేసిన వడా  చెన్నయ్ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించి బాగానే మెప్పించాడు. 

ఆ సినిమానే ఇప్పుడు KGF 2 లో ఛాన్స్ రావడానికి కారణమైంది. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజిగా ఉన్న KGF టీమ్ నెక్స్ట్ షెడ్యూల్ లో ఈ కుర్ర నటుడిని  జాయిన్ చేసుకోనుంది. రీసెంట్ గా అధీరా పాత్ర కోసం చిత్ర యూనిట్ సంజయ్ దత్ ని ఫైనల్ చేసినట్లు ఎనౌన్సమెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 200కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న KGF: చాఫ్టర్ 2 డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.