`సప్త సాగరాలు దాటి- సైడ్ బీ`.. ఎమోషనల్ టీజర్..
`సప్తసాగరాలు దాటి` మూవీ రెండు భాగాలుగా రూపొందింది. క్యాసెట్‌కి రెండు వైపుల అనేలా మొదటిది `సైడ్ ఏ` అయితే, ఇప్పుడు `సైడ్ బీ` రాబోతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన చిత్రం `సప్తసాగరాలు దాటి`. ఈ సినిమా గత నెలలో విడుదలై ఆకట్టుకుంది. కన్నడలో పెద్ద హిట్ అయ్యింది. కానీ తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా కాస్త స్లోగా ఉండటంతో తెలుగు ఆడియెన్స్ పెద్దగా రిసీవ్ చేసుకోలేకపోయారు. కానీ ఓఫ్రెష్ లవ్ స్టోరీ పరంగా, ఫీలింగ్ గుడ్ లవ్ స్టోరీగా ఈ మూవీ ఆకట్టుకుంటుంది. యూత్‌ని బాగా కనెక్ట్ అవుతుంది.
అయితే `సప్తసాగరాలు దాటి` మూవీ రెండు భాగాలుగా రూపొందింది. క్యాసెట్‌కి రెండు వైపుల అనేలా మొదటిది `సైడ్ ఏ` అయితే, ఇప్పుడు `సైడ్ బీ` రాబోతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అన్ని భాషల్లో ఏకకాలంలో రిలీజ్‌కి ప్లాన్ చేశారు. తెలుగులో ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేయబోతుంది. నవంబర్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు టీజర్‌ని రిలీజ్ చేశారు.
ఇందులో క్యాసెట్‌ని సైడ్ బీ వైపు తిప్పి ప్లే చేయగా, తన ప్రియురాలు ఏం చెప్పిందనేది హీరో మంచంపై పడుకుని వింటుంటాడు. ` ఏ గాడిద.. నువ్వు జైలు నుంచి బయటకొచ్చే రోజు పెద్ద సెలబ్రేషన్ ప్లాన్ చేశాను, ఇళ్లంతా ఫుల్‌గా డెకరేట్ చేస్తా` అని ఇందులో హీరోయిన్ చెబుతుంది. అది ఆద్యంతం ఎమోషనల్‌గా ఉంది. మొదటి భాగంలో హీరో జైలు నుంచి తాను బయటకు రాలేనని భావించి, తన వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఎందుకని చెప్పి, ఆమెకి దూరం కావాలనుకుంటాడు. తనని మర్చిపోయేలా చేస్తాడు.
దీంతో ఆమె పెళ్లికి సిద్ధమవుతుంది. ఓ వైపు పెళ్లి కూడా చేసుకుంటుంది. అంతలోనే ట్విస్ట్. మరి ఆ తర్వాత ఏం జరిగింది. క్యాసెట్‌కి `సైడ్ బీ`లో హీరోయిన్ ఇంకా ఏం చెప్పింది, హీరో లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది, వీరిద్దరి ప్రేమ కథ ఎలాంటి ముగింపు పలికింది` అనేది మిగిలిన కథ. హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, పవిత్ర లోకేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి భాగానికి తెలుగులో పెద్దగా ఆదరణ దక్కలేదు. మరి రెండో భాగానికి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.