నిమిషానికి పైగా సాగిన ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లిమ్ప్స్ మాంచి ఎంటర్టైన్మెంట్ పంచింది. గ్లిమ్ప్స్ కట్ చేసిన తీరు, వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటున్నాయి.
పేపర్ బాయ్ గా అలరించిన సంతోష్ శోభన్, ఏక్ మినీ కథ చిత్రంతో హిట్ అందుకున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఏక్ మినీ కథ ఓటిటిలో విడుదలై పాజిటివ్ టాక్ రాబట్టింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సప్పోర్ట్ కలిగిన సంతోష్ శోభన్ వరుస చిత్రాలు ప్రకటిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ ప్రేమ్ కుమార్. రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ప్రేమ్ కుమార్ మూవీ నుండి నేడు ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు.

నిమిషానికి పైగా సాగిన ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లిమ్ప్స్ మాంచి ఎంటర్టైన్మెంట్ పంచింది. గ్లిమ్ప్స్ కట్ చేసిన తీరు, వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటున్నాయి. హీరో సంతోష్ క్యారెక్టర్ కొంచెం కన్నింగ్ గా అనిపిస్తుంది. అమ్మాయిల వెంటపడే ఖిలాడీగా అనిపిస్తున్నాడు ఈ ప్రేమ్ కుమార్. గ్లిమ్ప్స్ చివర్లో నటుడు సుదర్శన్.. పెళ్లి కూతురు లేచిపోయింది, అంటూ పెళ్లి వేడుకలో డాన్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. మొత్తంగా ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లిమ్ప్స్ పోజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది.
ప్రేమ్ కుమార్ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శివ ప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ్ కుమార్ చిత్రానికి అనంత్ శ్రీకర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు.
