Asianet News TeluguAsianet News Telugu

#Prabhas:ప్రభాస్ కు తాతగా సంజయ్ దత్, అసలు కథ ఇదే

ఈ హారర్ కామెడీలో ప్రభాస్ తాతగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో తాత మరియు మనవడి మధ్య బంధం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేకర్స్ ఆ పాత్ర కోసం సంజయ్ దత్‌ని సంప్రదించారు. 

SanjayDutt to play #Prabhas grandfather in #Maruthi film
Author
First Published Dec 19, 2022, 6:14 PM IST


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు  కెజిఎఫ్ చాప్టర్ 2లో విలన్ పాత్రను పోషించాక మళ్ళీ దక్షిణాది డైరక్టర్స్ దృష్టి ఆయనపై పడింది.  ఈ క్రమంలో ఆయన ఓ తెలుగు సినిమా కమిటయ్యారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా కావటంతో  వెంటనే సంజయ్ దత్‌ ప్రాజెక్టుకు సంతకం చేసారని సమాచారం.
 
అందతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 2023 నుండి సినిమాకు డేట్స్ కేటాయించారు. రాజాడీలక్స్‌’ అనే ప్రచార టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ఓ ఇంటి సెట్లో ప్రభాస్‌, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌తోపాటు రిద్దికుమార్‌ మరో హీరోయిన్. బాహుబలి స్టార్‌ ఈ చిత్రంలో స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నాడు.

ఈ హారర్ కామెడీలో ప్రభాస్ తాతగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో తాత మరియు మనవడి మధ్య బంధం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేకర్స్ ఆ పాత్ర కోసం సంజయ్ దత్‌ని సంప్రదించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి బామ్మగా బాలీవుడ్‌ నటి జరీనా వహాబ్‌ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సంజయ్ దత్ అప్పట్లో ఓ థియేటర్ నడుపుతాడని...ఇప్పుడు ఆ థియేటర్ ని మనవడు తీసుకుని ముందుకు తీసుకెళ్తాడని చెప్తున్నారు. అందుకు తాత సాయిం అందిస్తాడని..సెకండాఫ్ లో వచ్చే తాత ఘోస్ట్ గా కనపడతాడని అంటున్నారు. 

మీడియా వర్గాల నుంచి వచ్చే సమాచారం మేరకు... 2023 ఏడాది మొదట్లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు మారుతి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ సాలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు.

ఇక సంజయ్ దత్ అప్పట్లో అంటే 1998లో నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాతో టాలీవుడ్‌ తెరపై మొదటిసారి కనిపించారు . ఆ సినిమాలో అతిథి పాత్రతో మెప్పించారు.  ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్‌ మరో మూడు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. వాటిలో ‘ఆదిపురుష్‌’ (AdiPurush) నిర్మాణానంతర పనుల్లో ఉండగా, ‘సలార్‌’(Salaar), ‘ప్రాజెక్ట్‌ కె’(Project K) షూటింగ్ లో పాల్గొంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios