Asianet News TeluguAsianet News Telugu

‘అధీర’పాత్ర ఎలా ఉంటుందో రివీల్ చేసిన సంజయ్ దత్!

యశ్‌ హీరోగా పీరియాడిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ సినిమా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌’ చాప్టర్‌ 2ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఇందులో సంజయ్‌దత్‌ అధీర అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. 

Sanjay Dutt Says Adheera From KGF Chapter 2 'Is Like Thanos
Author
Hyderabad, First Published Jul 30, 2019, 12:28 PM IST

‘కేజీఎఫ్‌-చాప్టర్‌2’లో తాను పోషించిన అధీర పాత్ర ఎలా ఉండబోతోందో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ మీడియాకు క్లూ ఇచ్చారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కేజీఎఫ్‌’ చిత్ర యూనిట్ ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా అధీర పాత్ర గురించి మీడియా ప్రశ్నించగా, సంజూ సమాధానం ఇచ్చారు. 

సంజయ్ దత్ మాట్లాడుతూ...‘కేజీఎఫ్‌2’లో అధీర పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే ‘అవెంజర్స్‌’లో థానోస్‌ పాత్రలా స్ట్రాంగ్ గా  ఉంటుంది. ‘చాప్టర్‌-1’ కేవలం అధీర చేతిని మాత్రమే చూపించారు. అది కాకుండా చివర్లో ఆ పాత్ర వస్తుంది. రెండో భాగంలో అధీర పాత్ర చాలా కీలకం. నా వేషం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి జోనర్‌లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇన్నాళ్లకు కుదిరింది’’ అని సంజయ్‌దత్‌ పేర్కొన్నారు. 

యశ్‌ హీరోగా పీరియాడిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ సినిమా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌’ చాప్టర్‌ 2ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఇందులో సంజయ్‌దత్‌ అధీర అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆ  పాత్ర గెటప్ చాలా డిఫెరెంట్ గా ఉంది. తలపాగా చుట్టుకుని రౌద్రమైన కళ్లు మాత్రమే కనిపించేలా తీర్చిదిద్దిన లుక్‌ చాలా ఆసక్తిగా  ఉంది. 

‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సంజయ్‌దత్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ‘‘ఆగస్ట్‌ 23న హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. ఆ తర్వాత కర్ణాటక, బళ్లారి మైన్స్‌లో సంజయ్‌దత్‌పై సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దీంతో మెజారిటీ షూటింగ్‌ పూర్తవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌కి సినిమాను విడుదల చేస్తాం’’ అని హోంబలే ఫిల్మ్స్‌ ప్రతినిధి తెలిపారు. కైకాల సత్యనారాయణ ఈ చిత్రానికి సమర్పకుడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios