Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ని డైరక్ట్ చేయనున్న సందీప్ వంగా, ఎలాంటి కథ అంటే...

 విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అది సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇందులో ఇదివరకెప్పుడూ కనిపించని ఓ కొత్త రకమైన పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారట. 

Sandeep Vanga to direct Prabhas25!?
Author
Hyderabad, First Published Oct 5, 2021, 9:53 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాహుబలితో  దేశవ్యాప్తంగా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని   సొంతం చేసుకున్న హీరో ప్రభాస్‌. అందుకే ప్రబాస్ సినిమాలన్నీ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. తాజాగా ఆయన నటించిన ‘రాధేశ్యామ్‌’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ప్రబాస్ చేస్తున్న మూడు కొత్త సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించేందుకు రెడీ అయ్యారు. అది ప్రభాస్‌ 25వ చిత్రంగా రూపొందబోతోంది. ఈ నెల 7నే ఆ సినిమాని ప్రకటించనున్నారు. ఈ నేపధ్యంలో ఏ డైరక్టర్ తో ప్రభాస్ ముందుకు వెళ్లనున్నారు అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అది సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇందులో ఇదివరకెప్పుడూ కనిపించని ఓ కొత్త రకమైన పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారట. ఇక సంవత్సరకాలంగా సందీప్ వంగా -డార్లింగ్ ప్రభాస్ కాంబో ప్రాజెక్టు ఆన్ లో ఉందన్న మాట వినిపిస్తోంది. సందీప్ డిజైన్ చేసిన ఫైనల్ స్క్రిప్ట్‌ను ఓకే చేసి-ప్రభాస్ 25వ ప్రాజెక్టుకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్  చేయబోతున్నారు. జేమ్స్‌బాండ్ తరహాలో ‘ఎరోటిక్ హీరోయిజం’ క్యారెక్టర్‌తో కంటెంట్‌ను డిజైన్ చేస్తున్నారన్న మాటా వినిపిస్తోంది.  

 

Related ప్రభాస్ 25వ సినిమా.. ఓ రేంజ్ లో అనౌన్స్మెంట్!

 సందీప్ డిఫరెంట్ స్టోరీతో ప్రభాస్ ను ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో 'అనిమల్' అన్న సినిమాని తెరకెక్కించబోతున్నాడు. సందీప్ రెడ్డి అనిమల్ గా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రణబీర్ సరసన పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించనుంది.ఇక నిజంగానే ప్రభాస్ 25కి సందీప్ రెడ్డి వంగానే దర్శకుడు అవునో కాదో తెలియాలంటే అక్టోబర్ 7 వరకూ ఆగాల్సిందే. 

ప్రస్తుతం ప్రభాస్, నాగ్ అశ్విన్‌తో సెట్స్‌పైకి వెళ్లాడు. పాన్ ఇండియా హీరో కోసం ‘సూపర్ హీరో’ క్యారెక్టరైజేషన్‌తో అశ్విన్ డిజైన్ చేసిన స్టోరీకి ప్రభాస్ ఓకే చెప్పడంతో -వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రాజెక్టు తెరకెక్కుతున్నట్టు అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. ఇక ‘రాధేశ్యామ్’ మూవీ విడుదలకు సిద్ధమవగా.. ‘సలార్ , ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే’ ( వర్కింగ్ టైటిల్ ) సైమల్ టేనియస్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి.   
 

Follow Us:
Download App:
  • android
  • ios