Asianet News TeluguAsianet News Telugu

#Animal టైటిల్ పెట్టడానికి కారణం ఇదే,స్టోరీ లైన్ ఏంటంటే

 ఓ స్టార్ హీరో సినిమాకు ‘యానిమల్’ అనే టైటిల్‌ పెట్టడం వెనక కారణం చెప్పుకొచ్చారు. 

Sandeep Vanga reveals details about Animal movie jsp
Author
First Published Nov 26, 2023, 11:13 AM IST


అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్షన్‌లో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘యానిమల్‌’. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు.  బాలీవుడ్ టా ప్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రమోషన్స్ కోసం ఇంటర్వూలు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో  ఓ స్టార్ హీరో సినిమాకు ‘యానిమల్’ అనే టైటిల్‌ పెట్టడం వెనక కారణం చెప్పుకొచ్చారు. 

సందీప్ వంగా మాట్లాడుతూ... సాధారణంగా మనకి చదువు, తెలివితేటలు వచ్చాయి కాబట్టి మనిషి అని పేరు పెట్టుకున్నామని.. నిజానికి మనిషి ఒక సోషల్ యానిమల్ అని సందీప్ అన్నారు. మనుషులకు ఐక్యూ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్‌లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించామని.. ఐక్యూ అనేది లేకపోతే మనం కూడా యానిమలే కదా అనేది తన వ్యక్తిగత భావన అని చెప్పారు. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకున్నప్పటి నుంచీ అలాగే అనిపించేదన్నారు. ‘నేను ఆలోచించింది ఏంటంటే.. యానిమల్‌కు ఐక్యూ ఉండదు. తన ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా ప్రవృత్తితో వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రకు సంబంధించిన కథకు యానిమల్ అనే టైటిల్ బాగుంటుందని ఆ పేరు పెట్టాను’ అని సందీ వివరించారు.

ఇక ఈ చిత్రం కాన్సెప్టు గురించి చెప్తూ...‘యానిమల్’ను తండ్రీకొడుకుల ప్రేమకథగా అనుకోవచ్చని.. ప్రాథమిక కథ అదేనని చెప్పారు. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది కథలోని సారాంశమన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకు ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ పాత్రకు ఉన్న పోలిక ఒక్కటేనని.. అది నిజాయితీ అని సందీప్ చెప్పారు. అర్జున్ రెడ్డికి కోపం వస్తే కంట్రోల్ చేయలేమని.. కానీ ‘యానిమల్’లో హీరో పాత్రకు మాత్రం సామాన్యంగా అందరికీ ఉండే కోపమే ఉంటుందన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ రెండూ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలేనని తెలిపారు. అయితే కథ, పాత్ర చిత్రీకరణ పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు.

అలాగే సినిమాలో రష్మిక పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనదని.. సినిమా ఆద్యంతం ఉంటుందని సందీప్ చెప్పారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. హీరోని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న భార్య పాత్రలో రష్మిక కనిపిస్తారన్నారు. హీరో తర్వాత అంత ప్రాధాన్యత రష్మిక, అనిల్ కపూర్ పోషించిన పాత్రలకే ఉందని చెప్పారు. తండ్రీకొడుకుల బంధంతో పాటు మంచి ప్రేమకథ కూడా ఉందన్నారు.

ఇప్పటికే ఈ చిత్రం  ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఇదే సమయంలో ఈ దర్శకుడు తెలుగు వాడు కావటంతో ఇక్కడ కూడా భారీ రిలీజ్ అవనుంది. ఈ క్రమంలో తెలుగు రైట్స్ మంచి డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.  తెలుగు రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం తెలుగు రైట్స్ నిమిత్తం 15 కోట్లు దిల్ రాజు చెల్లించటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నారని వినికిడి.  అలాగే ఈ మూవీ రన్‌టైమ్‌ చూస్తే భారీ నిడివితోనే వస్తోంది. ఏకంగా మూడు గంటల 21 నిమిషాల పాటు ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వెల్లడించారు. 

 ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్ట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా యానిమల్ ఉంటుందట. దాంతో యానిమల్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ పక్కా రివెంజ్ స్టొరీ అని తెలుస్తుంది.  యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios