మనోజ్‌బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైన హిందీ వెబ్‌ సీరీస్‌ చిత్రం ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’. ఈ సినిమాకి సీరీస్‌కు సీక్వెల్ గా ‘ది ఫ్యామిలీ మ్యాన్‌- 2’ తెరకెక్కింది. ఇందులో ప్రముఖ నటి సమంత నటించింది. ఆమె వెబ్‌సీరీస్‌లో నటించడం ఇదే మొదటిసారి.  ఇందులో ఉగ్రవాది పాత్రలో కనిపించింది.  ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ వెబ్‌సిరీస్‌ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సిరీస్‌ తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందని పేర్కొంటూ ఇప్పటికే పలువురు నుంచి విమర్శలు ఎదురైన విషయం విదితమే. 

అవన్ని ప్రక్కన పెడితే.. రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ సీజన్ 2 కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ వెబ్ సీరిస్ కోసం సమంత కు ఎంత పే చేసారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు సమంతకు 3.50-4 కోట్లు దాకా పే చేసారని తెలుస్తోంది. సినిమాలతో పోలిస్తే ఇది మంచి పేమెంట్. ఓటిటి ఇండస్ట్రీలో ఇదే హైయిస్ట్ పేమెంట్.

అలాగే ఫ్యామిలీ మెన్ సీజన్ 2లోని యాక్షన్ సీక్వెన్స్ అంత బాగా రావడానికి, తాను అంత బాగా చేయడానికి కారణం ఒక్కరేనట. యానిక్ బెన్ అనే యాక్షన్ కొరియోగ్రఫర్ గురించి సమంత తాజాగా చెప్పుకొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ అంత బాగా చేసేందుకు నాకు ఎంతో సహాయపడిన, శిక్షణ ఇచ్చిన యానిక్ బెన్‌కు స్పెషల్ థ్యాంక్స్. నా శరీరంలోని ప్రతీ భాగం నొప్పి పుట్టినా కూడా నా వెన్నంటే ఉండి చూసుకున్నావ్.. నా పెయిన్ కిల్లర్‌వి అయ్యావ్.. నాకు మామూలుగా హైట్స్ అంటే భయం. కానీ ఆ జంప్‌లు చేశానంటే.. నువ్ నా వెనుకున్నావ్ అనే ధైర్యంతోనే. థ్యాంక్యూ అంటూ యాక్షన్ డైరెక్టర్ మీద ప్రశంసలు కురిపించారు.

 ఈ వెబ్ సీరిస్ లో  ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’లో  ప్రధాన పాత్రలో నటిస్తుంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న కాథువాకుల రెండు కాదల్‌’చిత్రంలో విజయ్‌సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తోంది.