Asianet News TeluguAsianet News Telugu

ఉత్కంఠ భ‌రితంగా య‌శోద టీజ‌ర్‌, గర్భిణిగా సమంత స్పెషల్ లుక్..

చాలా కాలం తరువాత సమంత నుంచి ఫ్యాన్స్ కు అద్భుతమైన విజ్యువల్ ట్రీట్ అందింది. అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యశోద మూవీ రిలీజ్ కురెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఉత్కంటభరితమైన టీజర్ ను రిలీజ్ చేశారు టీమ్.  
 

Samantha Yashodha Movie Teaser Release
Author
First Published Sep 9, 2022, 1:08 PM IST

విడాకుల త‌ర్వాత స‌మంత ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటంలేదు. ఆ వేవ్ నుంచి బయట పడటానికి వరస సినిమాల చేస్తోంది. అంతే కాదు తన  సినిమాల స్పీట్ ను కూడా పెంచేసింది సీనియర్ బ్యూటీ. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా మారింది. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాలతో ఊపిరి మెసల కుండా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా సమంత తెలుగు, తమిళంలో చేసిన కాతువాకుల రెండు కాదల్.. సినిమా సూపర్ సక్సెస్ సాధించి సమంతలో జోష్ నింపింది. ఇక తెలుగులో వరుసగా మూడు సినిమాలతో సందడి చేయబోతుంది బ్యూటీ. అందులో యశోద మూవీ కూడా ఒకటి. 

హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న యశోద సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పటికే ఈమూవీ నుంచి గతంలో ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశారు. దానికి భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు యశోద సినిమా నుంచి అద్భుతమైన టీజర్ ను వదిలారు మేకర్స్.  ఈటీజర్ ఆసాంతం సమంత మీదనేనడుస్తుంది. ఆమె కథలికల ను క్యాచ్ చేస్తూ.. టీజర్ ఆకట్టుకుంది. ఇతర నటులపై టీజర్ లో పెద్దగా దృష్టి పెట్టలేదు మేకర్స్. 

 

 స‌మంత ప్రెగ్నెంట్ అని, మొద‌టి మూడు నెల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి అని డాక్ట‌ర్ చెబుతుంది. న‌డిచేట‌ప్పుడు జాగ్రత్త‌గా ఉండ‌మ‌ని, బ‌రువులు ఎత్త‌కూడద‌ని, ఏ ప‌ని చేసిన దెబ్బ త‌గ‌ల‌కుండా చూసుకోవాల‌ని, ఎప్పుడు సంతోషంగా న‌వ్వుతూ ఉండాల‌ని స‌ల‌హాలు చెబుతుంది. అయితే డాక్ట‌ర్ చెప్పిన స‌ల‌హాల‌కు పూర్తి భిన్నంగా స‌మంతను టీజ‌ర్‌లో చూపించారు.  వేగంగా ప‌రిగెత్త‌డం, బ‌రువులు ఎత్తడం, ఎవ‌రితోనే ఫైట్ చేస్తూ దెబ్బ‌లు తిన‌డం, భ‌య‌ప‌డ‌టం వంటివి చేస్తున్న‌ట్లు చూపించారు. ఇక స‌మంత న‌ట‌న వేరే లెవల్లో ఉంది. 

హీరోయిన్ గా ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలు చేసిన సమంత కెరీర్ లో ఇది  ఛాలెంజింగ్ రోల్. అద్భుతంగా హావభావాలు పలికించగలిగినస సమంత మాత్రమే ఈసినిమా చేయగలదని టీజర్ ద్వారానే నిరూపించింది స్టార్ హీరోయిన్. ఇక ఈళ విజువ‌ల్స్ థ్రిల్ కాన్సెప్ట్ కు సీనియర్ మ్యూజీషియన్  మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరిపోయిందనే చెప్పాలి. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మే ఈ సినిమాకు  సంగీతం అందిస్తున్న 

ఇక ఈసినిమాలో  సమంతతో పాటుగా.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  శ్రీదేవీ మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ యశోద సినిమాను  నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీని  పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని  చూస్తున్నారు. ఆగ‌స్టు 12 రిలీజ్ కావల్సిన ఈ సినిమా నీ ప‌లు కార‌ణాల వ‌ల్ల పోస్ట్ పోన్ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios