Asianet News TeluguAsianet News Telugu

పుష్ప 'శ్రీవల్లి'కి రంగస్థలం 'రామలక్ష్మి' నుంచి ఊహించని గిఫ్ట్.. గాల్లో తేలిపోతున్న రష్మిక

సౌత్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి సమంత. అందంతో పాటు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం ఆమె ప్రధాన ఆయుధం. అందుకే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆమె భాగమైంది.

Samantha surprise gift to Rashmika Mandanna, Here is her reaction
Author
Hyderabad, First Published Oct 2, 2021, 8:58 AM IST

సౌత్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి సమంత. అందంతో పాటు ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం ఆమె ప్రధాన ఆయుధం. అందుకే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆమె భాగమైంది. ఇక సమంత ఇండస్ట్రీలో ఇతర హీరోయిన్లు, కో స్టార్స్ తో మంచి ఫ్రెండ్ షిప్ మైంటైన్ చేస్తూ ఉంటుంది. 

ఇక టాలీవుడ్ లో కి మెరుపులా దూసుకువచ్చి ఓ వెలుగు వెళుతున్న నటి రష్మిక మందన. ఆమె నేషనల్ క్రష్ గా కుర్రాళ్లల్లో గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత, రష్మిక మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఇటీవల సమంత.. రష్మికకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. 

గత ఏడాది సమంత సొంతంగా సాకీ అనే బట్టల బ్రాండ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాకీ బ్రాండ్ మహిళల్లో బాగా పాపులర్ అయింది. సమంత ఇటీవల రష్మికకు సాకీ బ్రాండ్ నుంచి గిఫ్ట్ హాంపెర్ ని పంపింది. సమంత నుంచి గిఫ్ట్ రావడంతో రష్మిక సంతోషంతో గాల్లో తేలిపోతోంది. 

సమంత గిఫ్ట్ పై రష్మిక ఇన్స్టాగ్రామ్ లో స్పందించింది. 'కంగ్రాట్స్ బ్యూటిఫుల్ లేడి. సాకీ బ్రాండ్ కోసం నువ్వు చాలా చేస్తున్నావు. నువ్వు పంపిన గిఫ్ట్ నాకు నచ్చింది' అని రష్మిక పోస్ట్ పెట్టింది. 

ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో సమంత, రష్మిక గురించి అభిమానులు బాగా చర్చించుకుంటున్నారు. దానికి కారణం పుష్ప చిత్రం నుంచి విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్. శ్రీవల్లిగా ఈ చిత్రంలో రష్మిక నటిస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో సమంత రామలక్ష్మి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

ఇద్దరూ పల్లెటూరి యువతులుగానే నటించారు. దీనితో ఫ్యాన్స్ ఇద్దరి ఫస్ట్ లుక్స్ పోల్చుతూ చర్చించుకుంటున్నారు. రంగస్థలం చిత్రంలో రామలక్ష్మి పాత్ర సమంత కెరీర్ లో ఓ మెమొరబుల్ రోల్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్పపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios