Asianet News TeluguAsianet News Telugu

సమంత ‘ఓ బేబీ’ టీజర్ వచ్చేసింది!

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రం ‘ఓ బేబీ’. 

Samantha's Oh baby movie teaser released
Author
Hyderabad, First Published May 25, 2019, 4:36 PM IST

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు అనుకోకుండా 20 ఏళ్ల వయసున్న యువతి మారిపోతే  ఎలా ఉంటుందనే చిన్న ఐడియాతో ఈ మూవీ వస్తోంది.  ఈ సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్.

సమంత ను కొత్త అవతార్ లో  కనపడుతున్న ఈ టీజర్ లో మంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా  ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. `ఓబేబి`  టీజర్ లో స‌మంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా ఉన్నారు.  షూటింగ్ అంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు.  ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 

రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్సాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే... మ‌జిలీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న స‌మంత ఈ సినిమాతో  మరో హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios