Asianet News TeluguAsianet News Telugu

స‌మంత 'ఓ బేబి' ఫ‌స్ట్ లుక్‌!

సమంత అక్కినేని, నందినీ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం  `ఓ బేబి` . 

Samantha's Oh Baby first look unveiled
Author
Hyderabad, First Published May 22, 2019, 11:02 AM IST

సమంత అక్కినేని, నందినీ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం  `ఓ బేబి` . సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.  ఈ చిత్రంలో సమంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. `ఓబేబి` ఫ‌స్ట్ లుక్‌లో స‌మంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా ఉన్నారు.

షూటింగ్ పూర్త‌ిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం... పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వరలోనే అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. మీరు ఇక్కడ ఫస్ట్ లుక్ ని చూడవచ్చు. సమంత మాట్లాడుతూ...‘‘ఇండస్ట్రీలో 55 ఏళ్ల లెజెండరీ జర్నీని కంప్లీట్‌ చేసుకున్న సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకు శుభాకాంక్షలు.

ఈ సంస్థ తర్వాతి చిత్రం ‘ఓ బేబి’లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన స్వాతి పాత్ర లుక్‌ను విడుదల చేశాం’’ అని పేర్కొన్నారు. 
ఈ చిత్రంలో  ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి  రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సాంకేతిక వ‌ర్గం: మ్యూజిక్‌:  మిక్కి జె.మేయ‌ర్‌, కెమెరా:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్ , డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖీ, ప్రొడ‌క్ష‌న్ , డిజైన్‌:జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌, నిర్మాత‌లు:  సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, హ్యువు థామ‌స్ కిమ్ ,ఆర్ట్‌:  విఠ‌ల్‌.కె, ద‌ర్శ‌క‌త్వం:  బి.వి.నందినీ రెడ్డి, నిర్మాణ సంస్థ‌లు:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌, స‌హ నిర్మాత‌లు:  విజ‌య్ దొంకాడ‌, దివ్యా విజ‌య్‌.

Follow Us:
Download App:
  • android
  • ios