Asianet News TeluguAsianet News Telugu

విడిపోయాక మొదటి పోస్ట్.. కారణాలు చెప్పిన సమంత!

 కొన్ని రోజులుగా వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నా అవి రూమర్స్‌గానే మిగిలిపోతాయని అభిమానులు భావించారు. కానీ చివరకు ఆ వార్తలనే నిజం చేస్తూ తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు నాగ చైతన్య-సమంత. 

Samantha post indirectly says behind divorce
Author
Hyderabad, First Published Oct 4, 2021, 10:03 AM IST


 సమంత-నాగ చైతన్యలు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఇంతకాలం వారు విడిపోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ విడిపోతున్నామని స్వయంగా ప్రకటించారు. మూడేళ్లుగా ఎంతో అనోన్య దంపతులుగా కనిపించిన ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్‌కు అయ్యారు. ‘ఏం మాయ చేశావే’ మూవీతో ప్రెండ్స్ అయిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ క్షణం నుంచి ముచ్చటైన జంట అంటే వీళ్లే అన్నట్లు మెలిగిన ఈ జంట విడిపోవడంతో..  కారణాలేంటని సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఈ ప్రకటన వచ్చాక సమంత ఏ పోస్ట్ పెట్టలేదు. దాంతో ఎవరికి తోచింది వారు మాట్లాడుకోవటమే తప్ప సరైన క్లూ దొరకలేదు. తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ ని గమనిస్తే.. విడిపోవటానికి వెనుకున్న కారణాలు చెప్పకనే చెప్పేసినట్టు కనిపిస్తోంది. ‘ఈ ప్రపంచాన్ని మనం మార్చేయాలని అనుకుంటే.. ముందుగా మనం మారాలి.. మనది మనమే అన్ని పనులను చేసుకోవాలి. మనమే మన షెల్ఫ్‌ల దుమ్ముదులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మన లక్ష్యాలు గుర్తు చేసుకోకూడదు.. కలలు కనొద్దు.. ’ అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇది చదివిన వాళ్లు సమంత తాను ఒంటరిగా నిలబడి, తన లక్ష్యాలు, తన కలలను సాకారం చేసుకునేందుకు సమంత ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అనుకుంటున్నారు.  అక్కినేని కుటుంబం ఆంక్షలు పెట్టిందని అందుకే ఇలా దూరం పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. 

ఇక కొంతమంది అయితే అక్కినేని ఫ్యామిలీ అం​టే టాలీవుడ్‌లో ఓ బ్రాండ్‌ ఉంది. అలాంటి కుటుంబానికి కోడలిగా వెళ్లిన సమంత వారి పద్ధతులను పట్టించుకోకపోవడం వల్లే వారి మధ్య విభేదాలు తలెత్తాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంతేగాక సినిమాల పరంగా నిర్ణయాలు తీసుకుంటూ వరుస ప్రాజెక్ట్స్‌ సమంత ఒకే చేయడం, ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ సీన్స్‌లో నటించడం కూడా కారణమనుకుంటున్నారు. 

 ‘లాల్‌ సింగ్‌ చద్ధా’ మూవీ షూటింగ్‌లో భాగంగా చై నార్త్‌కు వెళ్లిన సమయంలోనే వారి మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయట. ఏది ఏమైనా తమ ఎంతగానో అభిమానించే సినిమా కుటుంబంలో కలత రేగడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనేది మాత్రం నిజం.
 

Follow Us:
Download App:
  • android
  • ios