Asianet News TeluguAsianet News Telugu

ఫోటో స్టొరీ: పబ్ లో అక్కినేని జంట.. వాటే రొమాంటిక్ కిస్!

 నాగ చైతన్య - సమంత పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అటు సినిమా కెరీర్ ను ఇటు ఫ్యామిలీ లైఫ్ ను చాలా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంజాయ్ కి కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కాస్త గ్యాప్ తీసుకొనే స్పెషల్ వెకేషన్స్ అంటూ విదేశాలకు చెక్కేస్తున్నారు. 

samantha naga chaithanya photo viral
Author
Hyderabad, First Published Sep 25, 2018, 4:03 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లో అక్కినేని యువ జంట టాప్ లో ఉంటుందనే  చెప్పాలి. నాగ చైతన్య - సమంత పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అటు సినిమా కెరీర్ ను ఇటు ఫ్యామిలీ లైఫ్ ను చాలా బ్యాలెన్స్ డ్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంజాయ్ మెంట్ కి కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కాస్త గ్యాప్ తీసుకొనే స్పెషల్ వెకేషన్స్ అంటూ విదేశాలకు చెక్కేస్తున్నారు. 

రీసెంట్ గా  అఖిల్ ని వేనేకేసుకొని స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే వీకెండ్స్ లో పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేశారట. అందుకు సంబందించిన పోటోలను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఒక ఫొటోలో సమంత చైతూను హగ్ చేసుకొని మంచి రొమాంటిక్ కిస్ ఇచ్చినట్లు ఉంది. ఆ ఫొటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'మై రే ఆఫ్ లైట్ చైతు' అని సమంత క్యాప్షన్ ఇచ్చిన విధానం నెటిజన్స్ ను ఆకట్టుకుంది. 

ఇక మరో ఫొటోలో చైతు తమ్ముడు అఖిల్ తో గంతులేస్తూ కనిపిస్తున్నట్లు ఉంది. మొత్తానికి ఈ అక్కినేని మినీ గ్యాంగ్ సినిమా కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ ని కూడా ఈక్వల్ గా మెయింటైన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఇటీవల ఈ భార్య భర్తలిద్దరూ వారిద్దరి సినిమాలను (యూ టర్న్ - శైలజారెడ్డి అల్లుడు) ఒకేసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios