Asianet News TeluguAsianet News Telugu

Samantha: మయోసైటిస్ ఎఫెక్ట్... కీలక ప్రాజెక్ట్స్ నుండి తప్పుకున్న సమంత?

సమంత కొన్ని బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేశారు. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ సమంత అక్కడ కొన్ని చిత్రాలు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్స్ నుండి సమంత తప్పుకోనున్నారట. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం సమంత ఆ చిత్రాల షూట్లో పాల్గొనే అవకాశం లేదు.

samantha deciding to walk out from bollywood projects
Author
First Published Dec 20, 2022, 4:36 PM IST


సమంత(Samantha) ప్రస్తుతం ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. సమంతకు సోకిన ఈ ప్రాణాంతక వ్యాధి మూడవ దశలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే సమంత చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లారని ప్రచారం అవుతుంది.  ఆమె కోలుకోవడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలో ఆమె సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. తెలుగులో సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలు చేస్తున్నారు. శాకుంతలం షూటింగ్ పూర్తి కావడంతో ఎలాంటి సమస్య లేదు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు జంటగా నటిస్తున్న ఖుషి పై ప్రభావం పడుతుంది. కొంత షూటింగ్ జరుపుకున్న ఖుషి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమంత పార్ట్ పక్కన పెట్టి మిగతా షూట్ చేయనున్నారు. అయితే సమంత కొన్ని బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేశారు. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ సమంత అక్కడ కొన్ని చిత్రాలు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్స్ నుండి సమంత తప్పుకోనున్నారట. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం సమంత ఆ చిత్రాల షూట్లో పాల్గొనే అవకాశం లేదు. 

ఈ క్రమంలో దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సమంత డెబ్యూ   సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 భారీ ఆదరణ  దక్కించుకుంది. ది ఫ్యామిలీ మాన్ 2 సక్సెస్ తో సమంతకు హిందీ సర్కిల్స్ లో ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువెత్తాయి. సిటాడెల్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ సమంతతో అనుకున్నారు. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే సమంత ఈ సిరీస్ కోసం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఇక సమంత యశోద చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యశోద ఆడియన్స్ ని ఆకట్టుకుంది. యశోద సక్సెస్ నేపథ్యంలో మేకర్స్ సీక్వెల్ తీయడానికి సిద్ధమని ప్రకటించారు. సమంత అంగీకరిస్తే యశోద పార్ట్ 2 భారీ బడ్జెట్ తో చేయనున్నారట. మయోసైటిస్ తో బాధపడుతూనే సమంత యశోద చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios