Asianet News TeluguAsianet News Telugu

చైతు, సమంత విడాకులు: ‘కొందరు హంతకులు, నిరంకుశులుంటారు’.. సమంత ఇన్‌స్టా స్టోరీపై హాట్ డిబేట్

చైతు, సమంత విడాకుల ప్రకటన సినీ అభిమానులను కుదిపేసింది. వీరిద్దరూ ప్రేమ పుట్టుక, కలిసి నటించిన సినిమాలు, ఇతర విషయాలపై చర్చ జరుగుతున్నది. దీనికి భిన్నంగా విడాకులకు కొన్ని గంటల ముందు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్టు చర్చను రసవత్తరంగా మార్చింది. చివరికి ప్రేమనే గెలుస్తుందంటూ ఆమె చేసిన పోస్టు ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది.

samanta instagram story making debate says love will win
Author
Hyderabad, First Published Oct 2, 2021, 5:42 PM IST

హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ కపుల్ నాగచైతన్య, సమంతల విడాకులు సినీ అభిమానులను కుదిపేసింది. రెండు నెలలుగా వీరి విడాకులపై దుమారం రేగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా వీరిద్దరూ విడాకులను ప్రకటించి ఆ ప్రచారానికి తెరదించినా మరెందరో అభిమానులు హృదయంలో కలవరాన్ని రేపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి మధ్య కొంతకాలంగా ముసలం నడుస్తూనే ఉన్నది. తాజాగా విడుదల ప్రకటనపై డిబేట్ హీటెక్కింది. 

ఇద్దరి మధ్య పరిచయం, కలిసి తీసిన సినిమాలు, ఇంకా ఎన్నో అంశాల చుట్టూ చర్చ జరుగుతున్నది. మరెన్నో విషయాలపై అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఈ రోజు ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన స్టోరీపై డిబేట్ జరుగుతున్నది.

‘నేను బాధలో ఉన్నప్పుడు నాకో విషయం గుర్తుకు వచ్చింది. చరిత్ర పొడుగునా సత్యం, ప్రేమ గెలిచిన దాఖలాలే ఉన్నాయని గుర్తు వచ్చింది. ఎందరో నిరంకుశులు, హంతకులున్నారు. ఒక్కోసారి వారికి ఓటమే లేదన్నట్టుగా కనిపించారు. కానీ, చివరికి వారు విఫలమయ్యారు. దీని గురించి ఆలోచించు.. ఎప్పటికీ’ అంటూ ఆమె ‘మై మామ సెడ్’ హ్యాష్ ట్యాగ్‌తో ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.

విడాకుల ప్రకటనకు ముందే ఈ స్టోరీ ఆమె పోస్టు చేశారు. బహుశా అప్పటికే విడాకులపై ఇరువురు ఓ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. కానీ, ఎప్పటికీ ప్రేమదే గెలుపు అనే విషయాన్ని ఆమె నొక్కివక్కాణించడం చర్చకు తావిస్తున్నది. అది కూడా తాను నేరుగా చెబుతున్నట్టు కాకుండా.. తల్లి తనకు చెప్పినట్టుగా హ్యాష్ ట్యాగ్ పెట్టారు. 

ఇరువురి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడి ఉండవచ్చన్న దుమారం రేగుతున్నప్పటి నుంచి సమంత సోషల్ మీడియా పోస్టుల్లో కొంత తేడా కనిపించింది. తరుచూ ఇలాంటి విషయాలు చెప్పడానికి తన తల్లి చెప్పినట్టుగా హ్యాష్ ట్యాగ్ చేసి పోస్టు పెట్టారు. ప్రేమదే గెలుపు అని చెప్పినప్పటికీ ఇరువురూ విడాకుల ప్రకటన చేయడమేంటనే అనుమానాలూ వస్తున్నాయి. బహుశా కలిసి ఉండాలనే ఆలోచన సమంతలో ఉన్నదేమో అనే సంశయాలకూ తెర తీసింది.

సాధారణంగా సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. ఏ అప్‌డేట్ అయినా తన అభిమానులతో పంచుకోవడం ఆమెకు అలవాటు. కానీ, చైతన్య అలా కాదు. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరు. కాబట్టి.. ఈ విడాకుల ప్రకటనకు తర్వాత లేదా ముందు వీటికి సంబంధించిన పోస్టులు కనిపించలేవు.

Follow Us:
Download App:
  • android
  • ios