Asianet News TeluguAsianet News Telugu

'మహర్షి' బాలీవుడ్ రీమేక్.. దిల్ రాజు ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Salman Khan plans to attain remake rights for Mahesh Babu's Maharshi
Author
Hyderabad, First Published May 9, 2019, 4:02 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రైతుల నేపధ్యంలో సందేశాత్మకంగా సినిమాను తెరకెక్కించారని కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం సినిమాను బాగా ల్యాగ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లు ఆసక్తికరంగా అనిపించడంతో సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట సల్లు భాయ్.

ఇప్పుడు హిట్ టాక్ రావడంతో సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. నిర్మాత దిల్ రాజు.. బోనీకపూర్ తో కలిసి బాలీవుడ్ లో ఈ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి 'ఎఫ్2' హిందీ రీమేక్ ను నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తో కూడా 'మహర్షి' రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో సల్మాన్ ఖాన్ కోసం సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో సల్మాన్.. మహేష్ నటించిన 'పోకిరి' సినిమాను 'వాంటెడ్'గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే 'మహర్షి' సినిమాను కూడా రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సల్మాన్.. ప్రభుదేవా దర్శకత్వంలో 'దబాంగ్ 3'లో నటిస్తున్నాడు. అది పూర్తయిన తరువాత ఈ రీమేక్ విషయంలో ఓ నిర్ణయానికి రానున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios