సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని, సాయి అన్నకి డైరెక్టర్ , ప్రొడ్యూసర్ ఇలా అందరికీ థాంక్స్ చెప్పాడు. మీరూ టీజర్ పై ఓ లుక్కేయండి.
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడిగా, 143 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు సాయిరాం శంకర్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా అనుకున్న స్దాయిలో క్లిక్ అవ్వలేదు. అన్నయ్య అంత పెద్ద డైరక్టర్ అయినా ..., కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేక వెనకబడిపోయాడు. హీరోగా అవకాశాలు వస్తున్నా.. స్టార్ ఇమేజ్ సాధించే స్ధాయి హిట్స్ మాత్రం రావటం లేదు. దీంతో తమ్ముడి కెరీర్ గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు పూరి వల్ల కాలేదు. అయితే గ్యాప్ తీసుకుని ఇప్పుడు సాయిరామ్ శంకర్...మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు వస్తున్నాడు.
సాయిరామ్ శంకర్ ..తన తాజా చిత్రం వెయ్ దరువెయ్ తో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సుప్రిమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌ను వాచ్చారు. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం.. టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందని ప్రశంసించాడు. సినిమా చూడాలనే కుతూహలాన్ని పెంచేస్తోందని మెచ్చుకున్నాడు. సినిమా ఖచ్చితంగా తెలుగులో సక్సెస్ అవ్వాలని, సాయి అన్నకి డైరెక్టర్ , ప్రొడ్యూసర్ ఇలా అందరికీ థాంక్స్ చెప్పాడు. మీరూ టీజర్ పై ఓ లుక్కేయండి.
హీరో హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. సుప్రీం సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉందని అన్నాడు. తమ సినిమా నుంచి ఇది వరకే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయని, వాటికి మంచి స్పందన వచ్చిందని చెప్పుకొచ్చాడు. దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. టీజర్ విడుదల చేసిన సాయిధరమ్ తేజ్‌కి హృదయపూర్వక ధన్యవాదలు తెలిపాడు. తమ టీం తన మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను అని నవీన్ రెడ్డి అన్నాడు.
సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా తమ సినిమా టీజర్ రిలీజ్ అయినందుకు ఆనందంగా ఉందని, తాము అనుకున్నట్టే చాలా బాగా వచ్చిందని నవీన్ రెడ్డి అన్నారు ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని మార్చ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత దేవరాజ్ తెలిపాడు.
