జపాన్ లో బిజీబిజీగా సాయి పల్లవి, స్టార్ హీరో కొడుకుతో సందడి..

ఇలా చెల్లి పెళ్లి అయిపోయిందోలేదో.. అలా జపాన్ చెక్కేసిందట సాయి పల్లవి. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరో తనయుడితో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరిగేస్తుందట. ఇంతకీ అసలు సాయి పల్లవి జపాన్ ఎందుకు వెళ్ళింది. 
 

Sai Pallavi In Japan With Aamir Khan Son Junaid Khan Movie Shooting JMS

హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే కాదు.. వారికి సినిమాల్లో మేజర్ రోల్ ఉండాలి.. వారి బ్యూటీనీ మాత్రమే కాదు.. వారి నటనను కూడా చూడండి అని.. ఒక రకంగా ఇండస్ట్రీలో పోరాటమే చేస్తుంది సాయి పల్లవి. స్టార్ హీరో సినిమాలలో హీరోయిన్స్ ను గ్లామర్ కోసమే వాడుకోవడంతో.. అటువంటి కథలు తన దగ్గరకు వచ్చినప్పుడు నిక్కచ్చిగా చేయను అని చెప్పే ధైర్యం సాయి పల్లవికే ఉంది. ఈక్రమంలోనే ఆమె మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు సినిమాలు రిజెక్ట్ చేసింది. 

ఇక ఈమధ్య కాస్త గ్యాప్తీసుకున్న సాయి పల్లవి..మళ్లీ యాక్టీవ్ అవుతోంది.  రీసెంట్ గా తన చెల్లి పెళ్ళి చేసి.. డాన్స్ లతో సోషల్ మీడియాను శేక్ చేసిన సాయి పల్లవి.. ఇక తన సినిమాల షూటింగ్స్ లో బిజీ కాబోతోంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ.. వాటిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక సాయి పల్లవి సినిమాల్లో నాగచైతన్య జోడీగా నటిస్తోన్న తంటేల్ మూవీ కూడా ఉంది. 

Sai Pallavi In Japan With Aamir Khan Son Junaid Khan Movie Shooting JMS

ఇకతండేల్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కాగా ప్రస్తుంతం సాయి పల్లవి  ఒక స్టార్ హీరో కొడుకుతో జపాన్ లో తిరుగుతున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పెద్దబ్బాయి జునైద్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక షెడ్యూల్  పూర్తయిపోయింది .

ఈ సినిమా షూటింగ్ కోసం జపాన్ వెళ్లారు సాయి పల్లవి. అక్కడ కీలక సన్నివేశాలు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇప్పటివరకు జపాన్లో ఏ సినిమా కూడా షూట్ చేయని సప్పోరో ఏరియాలో ఈ సినిమా షూటింగ్ చేసేందుకు పర్మిషన్ తెచ్చుకున్నారట . ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందట 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios