గత ఏడాది చివర్లో వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. క్రిస్మస్ కానుకగా విడుదలైన ప్రతిరోజూ పండగే మూవీ సూపర్ హిట్ నమోదు చేసింది. దర్శకుడు మారుతీ ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సరిగ్గా ఏడాది తరువాత మరో కొత్త సినిమాతో సాయి ధరమ్ సిద్ధం అయ్యాడు. 

సాయి ధరమ్ లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్న జీస్టూడియోస్ నేడు ఈ విషయాన్ని తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. 

వచ్చే నెలలో థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో కోవిడ్ తరువాత థియేటర్స్ లో దిగే మొదటి హీరోగా సాయి ధరమ్ రికార్డులకు ఎక్కనున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా థియేటర్స్ మూతపడడం జరిగింది. ప్రభుత్వాలు 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ చేసుకోవచ్చని అనుమతులు ఇవ్వడం జరిగింది. ఐతే థియేటర్స్ యాజమాన్యాలు ఆ నిబంధనతో నడపడానికి సిద్ధంగా లేవు. 

సోలో బ్రతుకే సో బెటర్ నిర్మాతలు మాత్రం డిసెంబర్ లో సోలో బ్రతుకే సో బెటర్ మూవీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.