Asianet News TeluguAsianet News Telugu

పవన్ సూచన, ప్రశ్నించేందుకు సిద్దమైన సాయి తేజ

మొదటనుంచీ మెగా మేనల్లుడు సాయి తేజపై పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన అభిమానం. తన మేనల్లుడుని నిలబెట్టడం కోసం కథలు వినటం, ప్రాజెక్టులు సెట్ చేయటం పవన్ చేసేవారు. గైడెన్స్ ఇస్తూ తెలుగులో ఓ స్టార్ హీరోగా నిలబెట్టేందుకు కృషి చేసారు. ఈ విషయాన్ని సాయి తేజ సైతం చాలా సార్లు మీడియాతో చెప్పారు. అయితే పవన్ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉండటంతో మేనల్లుడుపై దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు మరోసారి సాయి తేజ కెరీర్ టర్న్ తీసుకునే దిసగా తన వంతు సాయిం అందిస్తున్నారట.

Sai Dharam Tej TURNING MEDICAL STUDENT?
Author
Hyderabad, First Published Jun 9, 2020, 8:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మొదటనుంచీ మెగా మేనల్లుడు సాయి తేజపై పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన అభిమానం. తన మేనల్లుడుని నిలబెట్టడం కోసం కథలు వినటం, ప్రాజెక్టులు సెట్ చేయటం పవన్ చేసేవారు. గైడెన్స్ ఇస్తూ తెలుగులో ఓ స్టార్ హీరోగా నిలబెట్టేందుకు కృషి చేసారు. ఈ విషయాన్ని సాయి తేజ సైతం చాలా సార్లు మీడియాతో చెప్పారు. అయితే పవన్ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉండటంతో మేనల్లుడుపై దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు మరోసారి సాయి తేజ కెరీర్ టర్న్ తీసుకునే దిసగా తన వంతు సాయిం అందిస్తున్నారట.

కెరీర్ ప్రారంభంలో మంచి సక్సెస్ లు అందుకున్నప్పటికీ సాయి ధరంతేజ్.  ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కూరుకుపోయాడు. అయితే ఈ మెగా మేనల్లుడికి చిత్రలహరి సినిమా హిట్టు అందించి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన  ప్రతి రోజు పండగే సినిమా భారీ విజయం నమోదు చేసింది. దాంతో  సాయి ధరంతేజ్ కెరీర్ గాడిలో పడ్డారని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఈ మెగా మేనల్లుడు తర్వాతి సినిమాగా సోలో బ్రతుకే సో అనే టైటిల్ తో నిర్మితమవుతోంది. థియోటర్స్ ఓపన్ తర్వాత ఈ సినిమా విడుదల కానుంది. ఇక సినిమా షూటింగ్ పూర్తి కాగానే మరో ప్రాజెక్టు పట్టాలెక్కనున్నాడు.దర్శకుడు దేవకట్టా ఈ సినిమాకు తెరకెక్కించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారట . మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు దేవాకట్ట ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.

అలాగే ఈ సినిమాలో సాయి తేజ..మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నారట. ఇప్పటికే లాంచ్ అయిన ఈ సినిమాలో మెడికల్ మాఫియాపై సాయి తేజ పోరాటం చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న మెడికల్ సిస్టమ్ ని ప్రశ్నించేలా ఈ సినిమాలో సీన్స్ ఉంటాయిట.  పూర్తి యాక్షన్ తో నడిచే ఈ సబ్జెక్టు సాయికి పెద్ద హిట్ ఇస్తుందని భావిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సబ్జెక్టు కు సంభందించిన డైలాగు వెర్షన్ విన్న సాయి...తన కెరీర్ లో ఇప్పటిదాకా తన సినిమాల్లో దేనికీ ఇలాంటి డైలాగ్స్ పడలేదని చెప్పారట. ఓ డిఫరెంట్ మాడ్యులేషన్ లో సాయి చెప్పే డైలాగులకు థియోటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారట. స్క్రిప్టు లాక్ చేసి అక్టోబర్ నుంచి షూట్ కు వెళ్దామని నిర్ణయించుకున్నారట. అలాగే ఫైనల్ వెర్షన్ ని పవన్ కళ్యాణ్ వినబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా లాంచింగ్ కు పవన్ హాజరయ్యారు.ఈ సినిమాపై పవన్ సైతం ప్రత్యేకమైన దృష్టి పెట్టారట. ఏదీ రెగ్యులర్ గా ఉండవద్దని,ఫైట్స్ , పాటలు నుంచి ప్రతి విషయంలోనూ డిఫరెంట్ గా వెళ్ళమని పవన్ సూచించారట. ఈ మేరకు కసరత్తులు చేస్తున్నారట.

మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేధా పేతురాజ్ హీరోయిన్ గా ఎంపికైంది.  అయితే దర్శకుడు దేవకట్టా కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. వెన్నెల, ప్రస్థానం విమర్శకుల ప్రశంసలు గెలుచుకున్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇక ఆటోనగర్ సూర్య డిజాస్టర్ గురించైతే చెప్పాల్సిన పనే లేదు.  ఇన్ని ఫెయిల్యూర్ లు ఉన్న డైరెక్టర్ తో ఫెయిల్యూర్ లో నుండి ఇప్పుడే బయటపడ్డ సాయి సినిమా చేయడం ఫ్యాన్స్ కు కొంత ఆశ్చర్యంగా ఉన్నా దేవకట్టా చెప్పిన కథ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకున్నాడని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios