Asianet News TeluguAsianet News Telugu

సాహో .. అంతా ఫైట్ మాస్టర్స్ మాయ!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో ఇప్పటివరకు ఎవరు చూపించని యాక్షన్ థ్రిల్లర్ ని సాహో చూపించబోతోందని ఓ క్లారిటీ వచ్చేసింది. టీజర్ తోనే చిత్ర యూనిట్ కళ్ళు చెదిరేలా విజువల్స్ ని క్రియేట్ చేసింది. సినిమా కోసం ఏడుగురు ప్రముఖ యాక్షన్ కోరియేగ్రాఫర్స్ వర్క్ చేశారు. 

saaho stunt mastars work
Author
Hyderabad, First Published Jun 13, 2019, 12:11 PM IST

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో ఇప్పటివరకు ఎవరు చూపించని యాక్షన్ థ్రిల్లర్ ని సాహో చూపించబోతోందని ఓ క్లారిటీ వచ్చేసింది. టీజర్ తోనే చిత్ర యూనిట్ కళ్ళు చెదిరేలా విజువల్స్ ని క్రియేట్ చేసింది. సినిమా కోసం ఏడుగురు ప్రముఖ యాక్షన్ కోరియేగ్రాఫర్స్ వర్క్ చేశారు. 

హాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ - టాలీవుడ్.. ఇలా అన్ని ఏరియాల్లో సానపట్టిన స్టంట్ మాస్టర్స్ సినిమా కోసం వర్క్ చేశారు. ఒక్కో యాక్షన్ సీన్ కు ఒక్కో స్టంట్ మాస్టర్ ను ఉపయోగించిన యూవీ క్రియేషన్స్ సుజీత్ విజువల్స్ కి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. 

హెల్ బాయ్ - రష్ హావర్ వంటి సినిమాలకు పని చేసిన పెంగ్ జహాంగ్ అలాగే ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాల యాక్షన్ సీక్వెన్స్ కి వర్క్ చేసిన కెన్నీ బెట్స్ సరికొత్త తరహాలో హాలీవుడ్ రేంజ్ లో ఫైట్స్ ను రూపొందించినట్లు అర్ధమవుతోంది. ఎక్కువగా గన్స్ ఫైర్స్ - ఛేజ్ సీన్స్ ను వీరు డైరెక్ట్ చేశారు. 

ఇక కోలీవుడ్ స్టంట్ మాస్టర్ సిల్వా సౌత్ కి కావాల్సిన మసాలా ఫైట్ సీన్స్ ని క్రియేట్ చేశాడు. అలాగే మన రామ లక్ష్మణులు టాలీవుడ్ ఆడియెన్స్ రుచికి తగ్గట్టుగా బెస్ట్ ఫైట్ సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు దిలీప్ - స్టీఫెన్ - బాబ్ బ్రౌన్ వారి స్టయిల్లో సినిమాకు వర్క్ చేసినట్లు టీజర్ లో విజువల్స్ చెబుతున్నాయి. 

ఏదేమైనా దర్శకుడు సుజీత్ ఇంత పెద్ద సినిమాకు కెప్టెన్ గా ఉండి అనుభవం గల స్టార్ యాక్షన్ మాస్టర్స్ తో వర్క్ చేయించాడు అంటే నిజంగా అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios