Asianet News TeluguAsianet News Telugu

RX100 హీరోతో బోయపాటి శిష్యుడు!

RX100 సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన కార్తికేయ యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు. లవ్ స్టోరీలే కాకుండా మాస్ ఎంటర్టైనర్ లతో కూడా ఈ కుర్ర హీరో అభిమానులకు మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు. 

RX100 HERO UPCOMING MOVIE UPDATE
Author
Hyderabad, First Published Dec 19, 2018, 6:16 PM IST

RX100 సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించిన కార్తికేయ యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు. లవ్ స్టోరీలే కాకుండా మాస్ ఎంటర్టైనర్ లతో కూడా ఈ కుర్ర హీరో అభిమానులకు మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు. అసలు విషయంలోకి వస్తే త్వరలోనే కార్తికేయ ఒక సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. 

బోయపాటి దగ్గర గత కొంత కాలంగా సహాయ దర్శకుడిగా పనిచేసిన అర్జున్ జంధ్యాల కార్తికేయ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ కథ పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఇక సినిమాను ఈ నేల 27న లాంచ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. 

హైదరాబాద్ లోని ప్రముఖ సినీ స్టూడియోలో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి  వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారు. తిరుమల రెడ్డి - అనిల్ కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios