Asianet News TeluguAsianet News Telugu

ఏపి పాలిటిక్స్: సినీ స్టార్స్ కి డబ్బు'ల్' మూటలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈసారి మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఓ వైపు గెలుపెవరిది అనే విషయంలో జోరుగా బెట్టింగులు జరుగుతుంటే మరోవైపు సినిమాల్లేని కొంతమంది యాక్టర్స్ నాయకుల నుంచి డబ్బు మూటలు గట్టిగా అందుకుంటున్నట్లు టాక్ వస్తోంది. 

rumors on tollywood political actors
Author
Hyderabad, First Published Apr 5, 2019, 4:07 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈసారి మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఓ వైపు గెలుపెవరిది అనే విషయంలో జోరుగా బెట్టింగులు జరుగుతుంటే మరోవైపు సినిమాల్లేని కొంతమంది యాక్టర్స్ నాయకుల నుంచి డబ్బు మూటలు గట్టిగా అందుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఆ లెక్క 10 లక్షల నుంచు కోటి వరకు ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్. 

తెలంగాణ రాజకీయాలను పెద్దగా టచ్ చేయని నటీనటులు ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ లో గట్టిగా వేలెట్టేస్తున్నారు. కొందరైతే రేపటి గురించి ఆలోచించకుండా ఊహించని విధంగా ముందే రిజల్ట్ ని చెప్పేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న సినిమా వాళ్ళ కంటే ఎక్కువగా సీనియర్ పొలిటీషియన్స్ సెలబ్రెటీలతో ప్రచారాలు చేయిస్తుండడం గమనార్హం. 

ఇది జనాల మైండ్ ను ఎంతవరకు మారుస్తుందో గాని పార్టీ కోసం కష్టపడుతున్న నటీనటులకు మాత్రం మంచి లాభమే అని చెప్పాలి. ఎందుకంటే సినీ ఫీల్డ్ లో ఉన్న రెమ్యునరేషన్ కట్టే కూడా వారు డబుల్ డబ్బు మూటలు అందుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నాలుగు డైలాగులతో ప్రచారాలు చేస్తే చాలు. పార్ట్ టైమ్ లా డబ్బుకు డబ్బు.. ప్రచారంలో కనిపించినందుకు ఇంకాస్త పబ్లిసిటి వస్తుంది. అందుకే యాక్టర్స్ సినిమాల్లేకున్నా బాధపడటం లేదు. ఇలా పాలిటిక్స్ లో ఒక రాయేస్తే.. సెట్టయిపోవచ్చు. పైగా పార్టీ గెలిస్తే మరో బోనస్ లాంటిదని యాక్టర్స్ సరికొత్తగా ఆలోచిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios