ఎన్టీఆర్‌ సినిమా డాన్సర్ మాత్రమే కాదు, అంతకు మించి ఆయనలో క్లాసిక్‌ డాన్స్‌ ప్రతిభ కూడా ఉంది. చిన్నప్పుడు ఆయన కుచిపూడి డాన్స్ నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు, అనేక పబ్లిక్‌ షోల్లో ప్రదర్శనలు ఇచ్చారు. 

ఎన్టీఆర్‌ ఇప్పుడు స్టార్‌ హీరోలలో ఒకరు. అద్భుతమైన డాన్సులు చేయగలిగే హీరోల్లోనూ ఆయనది అగ్ర స్థానమే. తన వెయిట్‌తో సంబంధం లేకుండా మాస్‌, క్లాస్‌, వెస్ట్రన్‌ డాన్స్ స్టెప్పులతో ఫ్యాన్స్ కి పూనకం తెప్పిస్తుంటారు. అయితే ఎన్టీఆర్‌ సినిమా డాన్సర్ మాత్రమే కాదు, అంతకు మించి ఆయనలో క్లాసిక్‌ డాన్స్‌ ప్రతిభ కూడా ఉంది. చిన్నప్పుడు ఆయన కుచిపూడి డాన్స్ నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు, అనేక పబ్లిక్‌ షోల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆడియెన్న్‌ ని అలరించారు. అందుకు పలు పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.

`బాలరామాయణం` సినిమాతో బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించిన ఎన్టీఆర్‌ తన క్లాసికల్ డాన్స్ షోలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. చిన్నప్పుడు ఆయన ఓ వేదికపై కుచిపూడి డాన్స్ ని ప్రదర్శిస్తున్న సందర్భంగా తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఇంతటి అరుదైన వీడియోని చూసి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆనందంలో మునిగి తేలుతున్నారు.

YouTube video player

ఎన్టీఆర్‌కు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌ అంటే అమితమైన ఆసక్తి ఉండేదట. అది తెలిసి ఆయన తల్లి శాలిని నృత్యకళలో శిక్షణ ఇప్పించారట. డ్యాన్స్‌ నేర్చుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్‌ స్టేజ్‌పై నృత్యకళ ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాడట. దానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్గా మారింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం దసరా కాకనుగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది. దీంతోపాటు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్‌.