ప్రపంచం అంతా ట్రిపుల్ ఆర్ మ్యానియా నడుస్తున్న వేళ.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రకరకాల రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. జక్కన్న టీమ్ పై.. స్టార్ హీరోలు ఇద్దరిపై తమ ప్రేమను రకరకాలు గా చూపించుకుంటున్నారు ఫ్యాన్స్. 

ప్రపంచం అంతా ట్రిపుల్ ఆర్ మ్యానియా నడుస్తున్న వేళ.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రకరకాల రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. జక్కన్న టీమ్ పై.. స్టార్ హీరోలు ఇద్దరిపై తమ ప్రేమను రకరకాలు గా చూపించుకుంటున్నారు ఫ్యాన్స్. 

ఇప్పుడు మాత్రం ఎవరిని కదిలించినా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సినీ ప్రేమికుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ ఎట్టకేలకు రేపు(మార్చి 25న) రిలీజవుతోంది. ఇప్పటికే కటౌట్లు, పాలాభిషేకాలు, బ్యానర్లతో దుమ్ము లేపుతున్నారు ఫ్యాన్స్‌. ప్రీమియర్ షోలకు రెడీ అవుతున్నారు. ఇక ఈ హడావిడిలో ట్రిపుల్ ఆర్ టీమ్ కు ఫ్యాన్స్ నుంచి రకరకాలుగా శుభాకాంక్షలు వెల్లుతెత్తుతున్నాయి. రకరకాలుగా ట్రిపుల్ ఆర్ టీమ్ కు గిఫ్ట్స్ పంపిస్తున్నారు ఫ్యాన్స్. 

ఈ క్రమంలో నిజాంపేటకు చెందిన సత్యవోలు రాంబాబు అనే ఆర్టిస్ట్‌ రాజమౌళి సినిమాపై ఓ కళాఖండాన్ని రూపొందించి తన ప్రేమను చాటుకున్నాడు. అది కూడా ముక్కుతో పెయింటింగ్‌ వేసి ఔరా అనిపించాడు. కేవలం ముక్కుకు రంగులద్దుకుంటూ రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లను గీసి అందరినీ అబ్బురపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అటు హైదరాబాద్ సుదర్శన్ లో జక్కన్న భారీ కౌటౌట్ కూడా అందరిని ఆకర్శిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, హీరోలుగా ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లు గా నటించిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. మార్చ్ 25ను ట్రిపుల్ ఆర్ పండగగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి.. సరికొత్త రికార్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.