ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఒక సినిమా తీస్తున్నారంటే టాలీవుడ్ మాత్రమే కాదు జాతీయ సినిమా మొత్తం అటువేపే ఆసక్తిగా చూసే పరిస్దితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు మీడియా ఆ సినిమా విశేషాలు ఏమైనా తెలుస్తాయేమో అని  ఓ కెమెరా కన్ను అటు పడేసి ఉంచుతుంది. అభిమానులు అయితే, రాజమౌళి సినిమా విశేషాల కోసం విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) టైటిల్ తో  టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తీస్తున్నారు. జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా పీరియాడికల్ ఫిక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ ఆ సినిమా పైనే. ఇటు రాం చరణ్ అభిమానులు.. అటు ఎన్టీఅర్ అభిమానులు ఒక్క్కో అప్డేట్ కోసం నిత్యం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.  తాజాగా ఈ సినిమా గురించిన ఓ అప్ డేట్ వచ్చింది.

 . ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఇక  ఇందులో చెర్రీ, ఎన్టీఆర్‌, అలియా భట్‌ చిన్నప్పటి పాత్రల్లో నటించే వారి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉడాన్ సీరియల్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన స్పందన్ చతుర్వేది అలియా పాత్రలో కనిపించనున్నారు. వరుణ్ బుద్దాదేవ్‌ ఎన్టీఆర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు తెలుగు చిత్రాల్లో నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ చక్రి, రామ్ చరణ్ పాత్రలో నటించనున్నారు.  

ఇక  తెలంగాణా యోధుడు కొమరం భీమ్, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఇద్దరూ రెండు సంవత్సరాల పాటు మాయం అయిపోతారు. ఎటు వెళ్ళారో ఎవరికీ తెలీదు. తరువాత ఇద్దరూ ప్రత్యక్షమై కొమరక్మ్ భీమ నిజాం పాలకుల పైనా.. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ పాలకులపైనా యుద్ధం చేస్తారు. అయితే, ఈ మాయం అయిపోయిన సమయంలో వారు ఇద్దరూ కలిస్తే.. కలిసి పోరాటానికి దిగితే ఎలా ఉండేది? వారిద్దరూ కలిసి యుద్ధం అంటూ చేస్తే పరిస్థితులు ఎలా మారిపోయేవి అనే ఫిక్షన్ తో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.