Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ కంటెస్టెంట్ రోల్ రైడాపై నెటిజన్ల ప్రశంసలు!

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రోల్ రైడా ర్యాపర్ గా ప్రతిభ చాటుతున్నాడు. అయితే అతడికి సంబంధించిన 'అరుపు' అనే ర్యాప్ సాంగ్ ఇటీవల విడుదలైంది

roll rida's arupu song garners respect for the issue it addresses
Author
Hyderabad, First Published Aug 27, 2018, 6:26 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రోల్ రైడా ర్యాపర్ గా ప్రతిభ చాటుతున్నాడు. అయితే అతడికి సంబంధించిన 'అరుపు' అనే ర్యాప్ సాంగ్ ఇటీవల విడుదలైంది. కమ్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకి హరికాంత్ దర్శకత్వం వహించారు. రోల్ స్వయంగా ఈ పాటలో నటించారు. యూట్యూబ్ లో ఇప్పుడు ఈ పాట దూసుకుపోతుంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా మిలియన్ వ్యూస్ దిశగా పరుగులు తీస్తోంది.

సమాజంలో మహిళలపై పెరుగుతోన్న అత్యాచారాలు, అకృత్యాలపై ఈ ర్యాప్ వీడియోని రూపొందించారు. 'పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియదు.. చచ్చేవరకు ఏడుస్తూనే ఉంటానని' అంటూ ఆడపిల్ల పరిస్థితి గురించి వివరిస్తూ రోల్ పాడిన ఈ పాట అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన పాట ద్వారా అమ్మాయిలపై జరుగుతోన్న అఘాయిత్యాల గురించి రోల్ చెప్పిన తీరు ప్రతీ ఒక్కరినీ కట్టిపడేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో రోల్ ని చూసి ఇప్పటివరకు ట్రోల్ చేశామని, కానీ ఇప్పుడు ఆయనపై గౌరవం పెరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios