ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, నటుడు హేమంత్ కారు ప్రమాదానికి గురైంది.
ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, నటుడు హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హేమంత్ క్షేమంగా బయటపడ్డాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు వద్ద హేమంత్ కారు ఓ గేదెను ఢీ కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
ఆ సమయంలో అతడే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విజయవాడలో ‘మహర్షి’ సక్సెస్ మీట్ కార్యక్రమం పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
