ఈ ఏడాది రిలీజైన కేజీఎఫ్-2, చార్లీ 777 తర్వాత కన్నడలో విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది ‘కాంతార’. గత నెలలో కన్నడ భాషలో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 


రీసెంట్ గా కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ చిత్రం నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి ఇప్పుడు మరో కొత్త చిత్రం రిలీజ్ అయ్యింది. “కాంతారా” టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం కన్నడం లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “కాంతారా” సినిమాను రిలీజ్ చేయనున్నారు.”కాంతారా” అంటే సంస్కృత భాషలో అడవి.

ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది కూడా డెఫినెట్ గా మంచి వసూళ్లు సెట్ చేస్తుందని అని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసారు. 

ఈ ఏడాది రిలీజైన కేజీఎఫ్-2, చార్లీ 777 తర్వాత కన్నడలో విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది ‘కాంతార’. గత నెలలో కన్నడ భాషలో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు బుక్ మై షోలో 99 శాతం రేటింగ్ ఉండటం విశేషం. 50 వేల మంది ఓటు వేసినా ఈ స్థాయిలో పర్సంటేజ్ ఉండటం అంటే గొప్ప విషయమే అని ట్రేడ్ అంటోంది.

తెలుగులో ఈనెల 15న ‘కాంతార’ మూవీని విడుదల చేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాడు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మించారు.