గత ఏడాది సంచలనం రేపిన‌ దిశ హత్యాచారం కేసు, అందులో  నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమైన ఘటన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్‌'. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.  ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ ట్రైలర్ లో ఆయన పూర్తిగా ఆ రోజు జరిగన సంఘటన మొత్తం చెప్పేసారు. దాంతో తెరమీద ఆయన ఏం చూపెడతారు అనేది చర్చనీయాంశంగా మారింది. 

02:44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ నవంబర్‌ 26 ఉదయం 6:10 గంటలకు ప్రారంభం అవుతుంది. రోడ్డు పక్కన స్కూటీని పార్క్‌ చేసిన దిశపై అక్కడే ఉన్న నలుగురు లారీ డ్రైవర్ల కన్ను పడుతుంది. ఆ నిమిషమే వారి బుర్రలో విష బీజం నాటుకుంది.

 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో స్కూటీని పంచర్‌ చేస్తారు. సాయం కోసం రోడ్డు మీద నిల్చున్న దిశను కిడ్నాప్‌ చేసి లారీలో తీసుకెళ్తారు. ఆమెను దారుణంగా రేప్‌ చేసి.. అనంతరం మృతదేహాన్ని తీసుకొచ్చి పెట్రోల్‌ పోసి తగలబెడతారు. ఇది జరుగుతున్న సమయంలో ఓ పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అక్కడి నుంచి వెళ్లడంతో ముగుస్తుంది.ఆ ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి.

ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాను నట్టి కరుణసమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.'దిశ' ఘటన జరిగిన నవంబర్‌ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే తెలిపారు.