ఫైనల్ గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు. శుక్రవారం సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్లు చెబుతూ ఒక్క ఆంద్రప్రదేశ్ లో మాత్రం రిలీజ్ కావడం లేదని వివరణ ఇచ్చారు. 

ఇక రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే విధంగా సినిమా విడుదలపై స్టే విధించిన ఆంద్రప్రదేశ్ కోర్టు తీర్పుపై సుప్రీమ్ కోర్టులో సవాల్ చేస్తామని కూడా దర్శకుడు అర్జీవి  తెలియజేశారు. ఇక తెలంగాణ ఎన్నికల కమిషన్ సినిమా విడుదలకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు. 

బావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డు చెప్పమని తెలంగాణ హై  కోర్టు కూడా తీర్పును ఇచ్చింది. ఇదే విషయాన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ తరపున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏపీ కోర్టుకు తెలియజేశారు. ఫైనల్ గా ఏపీ న్యాయస్థానం ఇచ్చిన  తీర్పును సుప్రీమ్ కోర్టులో సవాల్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.