Asianet News TeluguAsianet News Telugu

Renu Desai: 'బ్రో' నిర్మాతలతో రేణు దేశాయ్ పార్ట్నర్ షిప్, ఆమె కోసం ప్రత్యేకంగా కేబిన్ ?

తన కల నెరవేర్చుకునేందుకు రేణు దేశాయ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలోకి ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో పవన్ కళ్యాణ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి.

Renu Desai entry into people media factory dtr
Author
First Published Dec 2, 2023, 10:52 AM IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చివరగా రవితేజ టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో రేణు దేశాయ్ పాత్రకి కూడా గుర్తింపు దక్కలేదు. అయితే సొంతంగా సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లు రేణు దేశాయ్ చాలా కాలంగా చెబుతోంది. 

తన కల నెరవేర్చుకునేందుకు రేణు దేశాయ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలోకి ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో పవన్ కళ్యాణ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చివరగా బ్రో చిత్రం చేసింది కూడా ఈ నిర్మాణ సంస్థకే. 

జనసేన పార్టీలో నంబర్ 2 గా ఉంటున్న నాదేండ్ల మనోహర్ కి పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ సన్నిహితులు. ఆయా విధంగా పవన్ తో కూడా వీరికి మంచి రిలేషన్ ఏర్పడింది. అలాగే రేణు దేశాయ్ తో కూడా వారికి మంచి సంబంధాలు ఉన్నాయట. తాను సినిమాలు నిర్మించాలనే కోరికని రేణు దేశాయ్ పీపుల్స్ మీడియా ద్వారా నెరవేర్చుకోనుంది. 

పీపుల్స్ మీడియా బ్యానర్ లో ప్రస్తుతంమల్టిపుల్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకదానిని రేణు దేశాయ్ టేకోవర్ చేసుకోవచ్చు. దీనికోసం ఆమెకి పీపుల్స్ మీడియాలో ప్రత్యేక కేబిన్ కూడా డిజైన్ చేశారట. ఇటీవలే రేణు దేశాయ్ మంచి రోజు చూసుకుని తన కేబిన్ లోకి ప్రవేశం చేసినట్లు కూడా తెలుస్తోంది. చూడాలి రేణు దేశాయ్ ఎలాంటి సినిమాలు నిర్మించనుందో.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios