ప్రముఖ నటి దర్శకురాలు రేణు దేశాయ్ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. అయితే ఈ సారి ఆమె వ్యక్తిగత జీవితం గురించి కాకుండా తన కవితలకు సంబందించిన విషయాన్నీ చెప్పారు

ప్రముఖ నటి దర్శకురాలు రేణు దేశాయ్ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. అయితే ఈ సారి ఆమె వ్యక్తిగత జీవితం గురించి కాకుండా తన కవితలకు సంబందించిన విషయాన్నీ చెప్పారు. త్వరలోనే బుక్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తన వివాహానికి సంబందించిన విషయాలను అలాగే తన పిల్లల గురించి ప్రశ్నలు అడగొద్దని అవన్నీ తరువాత చెబుతానని ఆమె యూ ట్యూబ్ లో లైవ్ లో తెలిపారు.ఇక తన కవితా సంకలనాన్ని డిసెంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. 

'మీ కాపీని మీరు ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు. విడుదలకంటే ముందు ఆర్డర్ చేసిన పుస్తకంలో నేనే స్వయంగా సంతకం చేసి పంపిస్తాను. మీ కాపీ కోసం జె.వి.పబ్లికేషన్స్ +918096310140 ( పబ్లిషర్) కు మెసేజ్ లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి అంటూ ఫెస్ బుక్ లో కూడా పోస్ట్ చేశారు. 

ఇక ఇందులో 30కి పైగా కవితలు ఉన్నట్లు వివరణ ఇస్తూ అందులో 15 కవితలను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తెలుగులోకి అనువదించినట్లు రేణు దేశాయ్ తెలిపారు.