బయోపిక్ లు తెలుగునాట వరసపెట్టి రెడీ అవుతున్నాయి. అయితే వాటిలో వివాదాలు బేస్ ఉన్నవాటి మీదే జనం దృష్టి ఎక్కువ పెడుతున్నారు. అలా కాకుండా కేవలం భజన చిత్రాలుగా రూపొందిన చిత్రాలను మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. మొన్న జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథనాయకుడు, మహానాయుకుడు సినిమాలది అదే పరిస్దితి. దాంతో బయోపిక్ అంటేనే నిర్మాతలు ఉలిక్కిపడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బయోపిక్ సైతం సర్వం పూర్తై..రిలీజ్ కు రెడీ అయ్యి చాలా కాలం అయ్యినా విడుదలకు నోచు కోవటం లేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఉద్యమ సింహం’. నటరాజన్‌, సూర్య, పి.ఆర్‌. విఠల్‌బాబు ప్రధాన పాత్రధారులు. తెలంగాణ రాష్ర్ట ఎన్నిక‌ల కు ముందు ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని దర్శక,నిర్మాతలు  భావించాతరు.  షూటింగ్ పూర్తిచేసి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ అన్నీ గ్రాండ్ గా నిర్వ‌హించారు. అయితే రకరకాల కారణాలతో ముఖ్యంగా ప్రభుత్వ దృష్టి ఈ సినిమా పై పడకపోవటం వల్లనో... ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ కాలేదు. 

కావాలనే ఎన్నిక‌ల ముందు ఈ సినిమా రిలీజ్ ఆపిచేసినట్లు చెప్పుకున్నారు. ఈ సినిమాని కనుక విడుదల చేస్తే ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించే అవ‌కాశం లేక‌పోలేదని..సినిమాలో కేసీఆర్ ని హైలెట్ చేస్తే... క‌ష్టం ఒక‌రిది..ఫ‌లితం మ‌రొక‌రిద‌ని వంటి విమ‌ర్శ‌లు వస్తాయని ఆ చిత్రాన్ని రిలీజ్ చేయలేద‌ని చెప్పుకున్నారు. 

అయితే ఇప్పుడు తెలంగాణా రాష్ర్టంలో ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. రెండ‌వ‌సారి ప్ర‌జ‌లు కేసీఆర్ కే ప‌ట్టం క‌ట్టారు. అయినా ఉద్య‌మ సింహం ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ కాలేదు. ఈ నేప‌థ్యంలో మీడియాలో  సినిమా అట‌కెక్కినట్లేన‌ని వార్తలు వస్తుున్నాయి. దానికి తోడు ఇప్పుడా సినిమా అవసరం ఎవరికీ కనపడటం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సినిమాపై బ‌జ్ ఉండేది. ఇప్పుడు అదీ  లేదు. దాంతో బిజినెస్ కూడా ఉండదు. ఇప్పుడు రిలీజ్ చేయాలంటే థియేట‌ర్ల‌కు ఎదురు డ‌బ్బులిచ్చి చేయాలి? అలా  చేసినా రిట‌ర్న్స్ వ‌స్తాయనే న‌మ్మ‌కం లేదు. ఈ క్రమంలో  ఉద్య‌మం సింహం టీమ్ ఆలోచనలో పడినట్లు సమాచారం.