Asianet News TeluguAsianet News Telugu

కీర్తి సురేష్ సినిమా ప్రక్కన పెట్టేసారేంటి? దిల్ రాజు ఉన్నా కూడా?

కీర్తి సురేష్ అంటే స్టార్ హీరోయిన్. ఆమె పేరు చెప్తే బిజినెస్ అయ్యిపోతుంది. బయ్యర్లు ముందుకొస్తారు. ఓటీటి వాళ్లు ఉత్సాహం చూపిస్తారు. టీవి ఛానెల్స్ వాళ్లు పండగ చేసుకుంటారు. అయినా సరే ఎప్పుడో పూర్తైన ఆమె సినిమా రిలీజ్ కు వెళ్ళకపోవటం ఏమిటి 

Reason Why good luck sakhi Movie Not Coming
Author
Hyderabad, First Published Oct 11, 2021, 9:11 AM IST

 క్రీడా నేపథ్యంలో సాగే చిత్రాలు వెండితెరపై తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ‘గుడ్‌లక్‌ సఖి’. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించారు. ఈ  సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది. కరోనా సమయంలోనే షూటింగ్ ముగించామని రిలీజ్ డేట్ సైతం  ప్రకటించారు. ఓటీటీ రిలీజ్ కు వెళ్లటం లేదన్నారు. టీజర్ వదిలాక సినిమాపై ఎక్సపెక్టేషన్స్ కూడా పెరిగాయి. కానీ రిలీజ్ మాత్రం కావటం లేదు. ఎక్కడ వచ్చింది సమస్య అనేది ఎవరకి ఆర్దం కావటం లేదు. ఆ మధ్యన ... ఆర్ది సమస్యలు వచ్చాయన్నారు.

ఫైనాన్సియల్ క్రైసిస్ నుంచి బయిట పడేసేందుకు ఈ సినిమా ను దిల్ రాజు టేకోవర్  చేశాడని.. షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేసేందుకు ముందుకు వచ్చాడంటూ వార్తలు వచ్చాయి. దిల్ రాజు ప్రెజెంట్స్ అని కూడా టీజర్ లో వేసారు. దాంతో దిల్ రాజు  ఓటీటీ లేదా థియేటర్ ఏదో ఒక మీడియం ద్వారా బయిటపడుతుందని అనుకున్నారు. అది జరిగి ఆరు నెలలు గడిచినా సినిమా ప్రసక్తే రావటం లేదు. కీర్తి సురేష్ వంటి స్టార్ ఉన్నా ఈ సమస్యలేంటి అంటున్నారు. ఈ నేపధ్యంలో దిల్ రాజు ఎందుకు పెండింగ్ లో పెట్టారు, సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారా లేక బిజినెస్ కాలేదా..లేక వేరే కారణాలా అంటూ ట్రేడ్ లోడిస్కషన్ మొదలంది. 

ఏదైమైనా సినిమా విడుదల విషయంలో ఇంకా ఒక స్పష్టత రాకపోవడం పట్ల కీర్తి సురేష్ అభిమానులుకు బాధ కలిగిస్తోంది. అయితే ఆమె చేసిన సినిమాలు వరస  ఫ్లాఫ్ అవటమే కారణం అంటున్నారు.  కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. మూడు సినిమాల్లో పెంగ్విన్ ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. ఆ తర్వాత విడుదల అయిన మిస్ ఇండియా కూడా నిరాశ పర్చింది. ఆ ఇంపాక్ట్ గుడ్ లక్ సఖిపై పడిందంటున్నారు.


https://www.youtube.com/watch?v=rjBv3K5FMoU&t=17s

ఆటల నేపథ్యంలో రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో మెరవనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సుధీర్‌చంద్ర పాదిరి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్‌గా ఎలా మారిందనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. దీంట్లో కీర్తి ఓ గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Follow Us:
Download App:
  • android
  • ios