Asianet News TeluguAsianet News Telugu

తేజ,బెల్లంకొండ విభేదం...కారణం కాజల్?

కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ టైమ్ లో ఒకప్పుడు ఒక వెలిగిన దర్శకుడు తేజతో ‘సీత’ టైటిల్ తో   ఓ సినిమా చేసారు.  సినిమా పూర్తయ్యి..రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సమయంలో దర్శకుడు, హీరో మధ్య కొన్ని విభేధాలు వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుకు కారణం కాజల్ అంటున్నారు. 

Reason behind Bellamkonda Srinivas Angry on Director Teja
Author
Hyderabad, First Published May 15, 2019, 8:10 AM IST

కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ టైమ్ లో ఒకప్పుడు ఒక వెలిగిన దర్శకుడు తేజతో ‘సీత’ టైటిల్ తో   ఓ సినిమా చేసారు.  సినిమా పూర్తయ్యి..రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సమయంలో దర్శకుడు, హీరో మధ్య కొన్ని విభేధాలు వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుకు కారణం కాజల్ అంటున్నారు. పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలా దీన్ని తేజ ప్రమోట్ చేయటం బెల్లంకొండకు నచ్చటం లేదంటున్నారు. ఆ విషయమై తేజతో చిన్నపాటి గొడవ కూడా అయ్యిందని చెప్పుకుంటున్నారు.

పోస్టర్స్, ట్రైలర్స్ అన్నిటిలోనూ తనను ప్రక్కన పెట్టి కాజల్ నే హైలెట్ చేస్తూండటం బెల్లంకొండకు డైజస్ట్ కావటం లేదని చెప్తున్నారు. కథ ప్రకారం తేజ అలా చేస్తున్నారని తెలిసినా మరీ తనను తీసిపారేసినట్లు ప్రమోషన్స్ లో ప్రక్కన పెట్టడం బాధ కలిగిస్తోందంటున్నారు. అయితే కథ చెప్పినప్పుడే బెల్లంకొండకు ఆ విషయం తెలుసు అని తేజ సమాధానం ఇస్తున్నారట. 

మరో ప్రక్క తేజ మాట్లాడుతూ..  తాను ఫెమినిస్ట్ అని.. ఫెమినిజం.. స్త్రీ స్వేచ్ఛకు సపోర్ట్ చేస్తానని.. అందుకే నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత ‘సీత’ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను ఎంచుకున్నానని తేజ చెప్తున్నారు. కాజల్ ఈ సినిమాపై చాలా ఇంట్రస్ట్ చూపించింది.. ఆమె కథ విన్న వెంటనే.. ఈ సినిమా నేనే చేస్తాను.. ఎన్ని కాల్షీట్లు కావాలన్నా ఇస్తాను అంటూ చెప్పడంతో.. తనని హీరోయిన్ గా ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. చాలా మంది పెద్ద హీరోలతో చర్చలు జరిపిన తర్వాత బెల్లంకొండను ఓకే చేసినట్లు తేజ చెప్పారు. 

హీరోయిన్ ఓరియెంటెడ్ అయినా తప్పకుండా చేస్తానని బెల్లంకొండ వచ్చాడని ప్రశంసించారు. సీత సినిమా ద్వారా ఏవిధమైన సందేశం ప్రేక్షకులకు ఇవ్వబోనని అన్నారు. సీత అగ్రెస్సివ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేదే నా కథ. అని తేజ తెలిపారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios